సంగీతం:కీరవాణి
గాత్రం:ఎస్పి.బాలు,చిత్ర
దర్శకత్వం:క్రాంతికుమార్
విడుదల:1991
పాట1
పల్లవి:
పూసింది పూసింది పున్నాగ
పూసంత నవ్వింది నీలాగ
సందేళ లాగేసె సల్లంగ
దాని సన్నాయి జళ్ళోన సంపెంగ
ముల్లోకాలే కుప్పెలై జడ కుప్పెలై
ఆడ జతులాడ
పూసింది పూసింది పున్నాగ
పూసంత నవ్వింది నీలాగ
సందేళ లాగేసె సల్లంగ
దాని సన్నాయి జళ్ళోన సంపెంగ
చరణం1:
ఇష్టసఖి నా చిలుక నీ పలుకే బంగారంగా
అష్టపదులే పలికె నీ నడకే వయ్యారంగ
కలిసొచ్చేటి కాలాల కౌగిళ్ళలో కలలొచ్చాయిలే
కలలొచ్చేటి నీ కంటి పాపాయిలే కధ చెప్పాయిలే
అనుకోని రాగమే అనురాగ దీపమై
వలపన్న గానమే ఒక వాయు లీనమై
పాడె మది పాడె
పూసింది పూసింది పున్నాగ
పూసంత నవ్వింది నీలాగ
సందేళ లాగేసె సల్లంగ
దాని సన్నాయి జళ్ళోన సంపెంగ
చరణం2:
పట్టుకుంది నా పదమే నీ పదమే పారాణిగా
కట్టుకుంది నా కవితే నీ కళలే కళ్యాణిగా
అరవిచ్చేటి ఆ భేరి రాగాలకే స్వరమిచ్చావులే
ఇరుతీరాల గోదారి గంగమ్మకే అలలిచ్చావులే
అల ఎంకి పాటలే ఇల పూల తోటలై
పసి మొగ్గరేకులే పరువాల చూపులై
పూసె విరబూసె
పూసింది పూసింది పున్నాగ
పూసంత నవ్వింది నీలాగ
సందేళ లాగేసె సల్లంగ
దాని సన్నాయి జళ్ళోన సంపెంగ
ముల్లోకాలే కుప్పెలై జడ కుప్పెలై
ముల్లోకాలే కుప్పెలై జడ కుప్పెలై
ఆడ జతులాడ
పూసింది పూసింది పున్నాగ
పూసంత నవ్వింది నీలాగ
సందేళ లాగేసె సల్లంగ
దాని సన్నాయి జళ్ళోన సంపెంగ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
పాట2
బద్దరగిరి రామయ్య పాదాలు కడగంగ పరవల్లు తొక్కింది గోదారి గంగ
పాపికొండలకున్న పాపాలు కరగంగ పరుగుళ్ళు తీసింది గోదారి గంగ
సమయానికి తగు పాటపాడెనే
సమయానికి తగు పాటపాడెనే
త్యాగరాజుని లీలగా స్మరించునటు
సమయానికి తగు పాటపాడెనే
ప ప మగరి రి మగరి రిస స స ద స స రిరి సరిమ
సమయానికి తగు పాటపాడెనే
ధీమంతుడు ఈ సీతారాముడు సంగీత సంప్రదాయకుడు
సమయానికి తగు పాటపాడెనే
ద ద పదప దపమ మ పమగరి రిపమ ప ప సారిమ
సమయానికి తగు పాటపాడెనే
రారా పలుకరాయని కుమారులే ఇలా పిలువగ నోచని వాడు
సమయానికి తగు పాటపాడెనే
దపమపదస దదప పమగిరి స స సా దదప మగరి రి స స దదాప మపదస దదరిరి సని దస పదమప మగరిరి
సమయానికి తగు పాటపాడెనే
చిలిపిగ సదా కన్నబిడ్డవలె ముద్దు తీర్చుచిలకంటి మనవరాలు
సదాగ లయలతేల్చి సుతుండు కనుదెంచు నంచు ఆడి పాడు
శుభ సమయానికి తగు పాటపాడెనే
సదాభక్తుల నడతులే కనెనే అమరికగా నా పూజకు నేనే అలుక వద్దనెనే
విముఖులతో చేరబోకుమని ఎదగరిగిన చాలుబొమ్మననే
తమషమాది సుఖదాయకుడగు శ్రీత్యాగరాజనుతుడు చెంతరాకనే స
బద్దరగిరి రామయ్య పాదాలు కడగంగ పరవల్లు తొక్కింది గోదారి గంగ
చూపుల్లో స్నానాల సివమైన గంగ కల్లలో పొంగింది గోదారి గంగ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
2 comments:
చాలా సంతోషంగా ఉంది మీ బ్లాగ్ చూసాక. (ఇదే మొదటిసారి చూడడం).... తెలుగు సాహిత్యానికి మీరు చేస్తున్న సేవ అబినందనీయం.... కాస్త విభిన్నంగా ఉన్న పాటలు నేను టపా చేస్తున్నాను ఇక్కడ http://www.mytelugulyrics.wordpress.com .... ఉంటాను. - ప్రవీణ్
పాటల రచయితలు ఎవరు అనేది కూడా టాగులలోఁ పెడిడే చాలా బావుండు.
Post a Comment