Sep 16, 2007

మమతల కోవెల

గాత్రం: బాలు,సుశీల



పల్లవి:

తెలియని రాగం పలికింది తీయని భావనలో
తెలియని రాగం పలికింది తీయని భావనలో
మనసే జ్యోతిగ వెలిగింది మమతలకోవెలలో
ఈ మమతలకోవెలలో
తెలియని రాగం పలికింది తీయని భావనలో

చరణం1:

ఆకాశదీపానివై నాకోసమే రమ్మని
నా గుండె గుడిగంటలో నా దానివే నీవని
గోరంత పసుపెట్టి ఊరంత కబురెట్టే శ్రీవారే రావాలని
కుంకుమతో కుశలమని పారాణే పదిలమని
దీవించు దేవుళ్ళే మన ఇంటివారని

తెలియని రాగం పలికింది తీయని భావనలో
మనసే జ్యోతిగ వెలిగింది మమతలకోవెలలో
ఈ మమతలకోవెలలో

చరణం1:

ఏ జన్మకే గమ్యమో తెలిసేది కాలానికే
ఏ పువ్వు ఏ పూజకో తెలిసేది దైవానికే
ఏ జన్మకేమైన ఈ జన్మలో నీకు ఖైదీనే అయ్యానుగా
బ్రతుకైనా వెతలైనా జతగానే పంచుకునే శ్రీవారే కావాలి ఏ జన్మకైనా

తెలియని రాగం పలికింది తీయని భావనలో
మనసే జ్యోతిగ వెలిగింది మమతలకోవెలలో
ఈ మమతలకోవెలలో
తెలియని రాగం పలికింది తీయని భావనలో

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments: