పల్లవి:
ఆఅ అ అ ఆ ఆ ఆ ఆ అ అ ఆ
కొత్తగా రెక్కలొచ్చెనా గూటిలోని గువ్వపిల్లకి
మెత్తగా రేకు విచ్చెనా
మెత్తగా రేకు విచ్చెనా
కొమ్మచాటువున్న కన్నెమల్లెకి కొమ్మచాటువున్న కన్నెమల్లెకి
కొత్తగా రెక్కలొచ్చెనా ఆ
మెత్తగా రేకు విచ్చెనా ఆ
చరణం1:
కొండదారి మార్చింది కొంటెవాగు జోరు
కులుకులెన్నొ నేర్చింది కలికి ఏటి నీరు
అహ అహహహ హహహహ ఆఅ
కొండదారి మార్చింది కొంటెవాగు జోరు
కులుకులెన్నొ నేర్చింది కలికి ఏటి నీరు
బండరాళ్ళ హొరుమారి పంటచేల పాటలూరి
బండరాళ్ళ హొరుమారి పంటచేల పాటలూరి
మేఘాల రాగాల మాగాణి ఊగెలా
సిరిచిందు లేసింది కనువిందు చేసింది
కొత్తగా రెక్కలొచ్చెనా మెత్తగా రేకు విచ్చెనా
చరణం2:
వెదురులోకి ఒదిగింది కుదురులేని గాలి
ఎదురులేక ఎదిగింది మధురగానతేలి
అహ అహహహ ఆఅ అహహహ
వెదురులోకి ఒదిగింది కుదురులేని గాలి
ఎదురులేక ఎదిగింది మధురగానతేలి
భాషలోన రాయలేని రాసలీల రేయిలొని
అబ్బ భాషలోన రాయలేని రాసలీల రెయిలొని
యమునా తరంగాల కమనీయ శృంగార
కళలెన్నో చూపింది కలలెన్నో రేపింది
కొత్తగా రెక్కలొచ్చెనా గూటిలోని గువ్వపిల్లకి
మెత్తగా రేకు విచ్చెనా
మెత్తగా రేకు విచ్చెనా
కొమ్మచాటువున్న కన్నెమల్లెకి కొమ్మచాటువున్న కన్నెమల్లెకి
కొత్తగా రెక్కలొచ్చెనా
మెత్తగా రేకు విచ్చెనా
|
No comments:
Post a Comment