Sep 30, 2007

గులేబకావళి కధ

తారాగణం:రామారావు,జమున
సాహిత్యం:డా||సి.నారాయణరెడ్డి
నిర్మాత:త్రివిక్రమరావు
దర్శకత్వం:రామారావు
విడుదల:1962


పల్లవి:

నన్ను దొచుకొందువటే
నన్ను దొచుకొందువటే వన్నెల దొరసాని
కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి
నిన్నే నా స్వామి
నన్ను దొచుకొందువటే

చరణం1:

తరియింతును నీ చల్లని చరణమ్ముల నీడలోన
తరియింతును నీ చల్లని చరణమ్ముల నీడలోన
పూల దండ వోలె కర్పూర కలికవోలె కర్పూర కలికవోలె
ఎంతటి నెరజాణవొ నా అంతరంగమందు నీవు
ఎంతటి నెరజాణవొ నా అంతరంగమందు నీవు
కలకాలము వీడని సంకెలలు వేసినావు, సంకెలలు వేసినావు

నన్ను దొచుకొందువటే
నన్ను దొచుకొందువటే వన్నెల దొరసాని
కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి
నిన్నే నా స్వామి
నన్ను దొచుకొందువటే

చరణం2:

నామదియే మందిరమై నీవే ఒక దేవతవై
నామదియే మందిరమై నీవే ఒక దేవతవై
వెలసినావు నాలో నే కలసి పోదు నీలొ
కలసి పొదు నీలొ
ఎనాటిదొ మనబంధం ఎరుగరాని అనుబంధం
ఎనాటిదొ మనబంధం ఎరుగరాని అనుబంధం
ఎన్ని యుగాలైన ఇది ఇగిరిపోని గంధం
ఇగిరిపోని గంధం


నన్ను దొచుకొందువటే
నన్ను దొచుకొందువటే వన్నెల దొరసాని
కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి
నిన్నే నా స్వామి
నన్ను దొచుకొందువటే


||

No comments: