సంగీతం: శ్రీ
గాత్రం: చిత్ర
నిర్మాతలు:యార్లగడ్డ సురేంద్ర,రాంగోపాల్ వర్మ
దర్శకత్వం:రాంగోపాల్ వర్మ
సంస్థ:ఎస్.ఎస్.క్రియేషన్స్,వర్మ ఆర్ట్స్
విడుదల:1993
అలుపన్నది వుందా
ఎగిరే అలకు ఎదలోని లయకు
అదుపన్నది వుందా
కలిగే కలకు కరిగే వరకు
మెలికలు తిరిగే నది నడకలకు
మరి మరి ఉరికె మది తలపులకు
లల లల లలలలా
అలుపన్నది వుందా
ఎగిరే అలకు ఎద లోని లయకు
అదుపన్నది వుందా
కలిగే కలకు కరిగే వరకు
నాకోసమే చినుకై కరిగి
ఆకాశమే దిగదా ఇలకు
నా సేవకే సిరులే చిలికి
దాసోహమే అనదా వెలుగు
ఆరారు కాలాల అందాలు
బహుమతి కావా నా ఊహలకు
కలలను తేవా నా కన్నులకు
లల లల లలలలా
అలుపన్నది వుందా
ఎగిరే అలకు ఎదలోని లయకు
అదుపన్నది వుందా
కలిగే కలకు కరిగే వరకు
నీ చూపులే తడిపే వరకు
ఏమైనదో నాలో వయసు
నీ ఊపిరే తగిలే వరకు
ఎటు వున్నదో మెరిసే సొగసు
ఏడేడు లొకాల ద్వారాలు
తలుపులు తెరిచె తరుణం కొరకు
ఎదురుగ నడిచే తొలి ఆశలకు
లల లల లలలలా
అలుపన్నది వుందా
ఎగిరే అలకు ఎదలోని లయకు
అదుపన్నది వుందా
కలిగే కలకు కరిగే వరకు
మెలికలు తిరిగే నది నడకలకు
మరి మరి ఉరికె మది తలపులకు
లల లల లలలలా
ఉం ఉం ఉహు ఉహు ఉహు ఉం ఉం ఉహు ఉహు ఉహు ఉం
|
No comments:
Post a Comment