Sep 19, 2007

సిరివెన్నెల

తారాగణం: శర్వదమన్ బెనర్జి,మున్ మున్ సేన్,సుహాసిని,సంయుక్త
సాహిత్యం:సీతారామశాస్త్రి
సంగీతం:కెవి.మహదేవన్
దర్శకత్వం:కె.విశ్వనాథ్
సంస్థ:గీతకృష్ణ మూవీ కంబైన్స్
విడుదల:1986



పల్లవి:

విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం ఓం
ప్రాణనాడులకు స్పందననొసగిన ఆది ప్రణవనాదం ఓం
కనుల కొలనులొ ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం
ఎదకనుమలలో ప్రతిధ్వనించిన విరించిపంచి గానం ఆ ఆ

సరసస్వరసురఝరీగమనమవు సామవేద సారమిది
సరసస్వరసురఝరీగమనమవు సామవేద సారమిది
నే పాడిన జీవన గీతం...ఈ గీతం

విరించినై విరచించితిని ఈ కవనం
విపంచినై వినిపించితిని ఈ గీతం

చరణం1:

ప్రాతిస వేణీయ పైన దినకర మయూగ తంత్రులపైన
జాగృత విహంగ తతులే వినీల గగనపు వెదిక పైన
ప్రాతిస వేణీయ పైన దినకర మయూగ తంత్రులపైన
జాగృత విహంగ తతులే వినీల గగనపు వేదిక పైన
పలికిన కిలకిల త్వనముల స్వరగతి జగతికి శ్రీకారము కాగ
విశ్వకార్యమునకిది భాష్యముగా

విరించినై విరచించితిని ఈ కవనం
విపంచినై వినిపించితిని ఈ గీతం

చరణం2:

జనించు ప్రతిశిశు గలమున పలికిన జీవననాద తరంగం
చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయమృదంగధ్వానం
జనించు ప్రతిశిశు గలమున పలికిన జీవననాద తరంగం
చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయమృదంగధ్వానం
అనాదిరాగం ఆది తాళమున అనంత జీవన వాహిని గా..
సాగిన సృష్టి విలాసము నే...

విరించినై విరచించితిని ఈ కవనం
విపంచినై వినిపించితిని ఈ గీతం

నా ఉచ్వాసం కవనం నా నిశ్వాసం గానం
నా ఉచ్వాసం కవనం నా నిశ్వాసం గానం
సరసస్వరసురఝరీగమనమవు సామవేద సారమిది
నేపాడిన జీవన గీతం...ఈ గీతం

| |

No comments: