Sep 17, 2007

మాతృదేవోభవ

తారాగణం :మాధవి,నాజర్,తనికెళ్ళ భరణి
గాత్రం :కీరవాణి
సాహిత్యం :వేటూరి
సంగీతం :కీరవాణి
నిర్మాత :కె.ఎస్.రామారావు
దర్శకత్వం :కె.అజెయ్ కుమార్
విడుదల :1993




పల్లవి:


రాలిపొయే పువ్వా నీకు రాగాలెందుకే , తొటమాలి నీ తోడు లేడులే
వాలిపొయే పొద్దా నీకు వర్ణాలెందుకే , లోకమెన్నడో చీకటాయెలే
నీకిది తెలవారని రేయమ్మా ,కలికి మాచిలక పాడకు నిన్నటి నీ రాగం
రాలిపొయే పువ్వా నీకు రాగాలెందుకే , తొటమాలినీ తోడు లేడులే
వాలిపొయే పొద్దా నీకు వర్ణాలెందుకే ,లోకమెన్నడో చీకటాయెలే

చరణం1:

చెదిరింది నీ గూడు గాలిగా చిలకగోరింకమ్మ గాధగా
చిన్నారి రూపాలు కన్నీటి దీపాలు కాగా ఆ ఆ ఆఅ
తనవాడు తారల్లో చేరగా మనసుమాంగల్యాలు జారగ
సిందూరవర్ణాలు తెల్లారి చల్లారి పోగా
తిరిగే భూమాతవు నీవై వేకువలో వెన్నెలవై
కరిగే కర్పూరం నీవై ఆశలకే హారతివై


రాలిపొయే పువ్వా నీకు రాగాలెందుకే ,తొటమాలి నీ తోడు లేడులే
వాలిపొయే పొద్దా నీకు వర్ణాలెందుకే

చరణం2:


అనుబంధమంటేనె అప్పులే కరిగే బంధాలన్ని మబ్బులే
హేమంతరాగాల చేమంతులే వాడిపోయే ఆ ఆ
తనరంగు మార్చింది రక్తమే తనతో రాలేనంది పాశమే
దీపాల పండక్కి దీపాలు కొండెక్కిపోయే
పగిలే ఆకాశం నీవై జారిపడే జాబిలివై
మిగిలే ఆలాపన నీవై తీగ తెగే వీణియవై

రాలిపొయే పువ్వా నీకు రాగాలెందుకే , తొటమాలి నీ తోడు లేడులే
వాలిపొయే పొద్దా నీకు వర్ణాలెందుకే , లోకమెన్నడో చీకటాయెలే ఏ ఏ



||

1 comment:

హృదయ బృందావని said...

ammo 5 days lo inni postings aa. super speed gaa meeru. :) chaalaa baagunnaayandi. audio koodaa pedutunnaaru. very nice.