దర్శకత్వం :ఎ ఎం.రత్నం
నిర్మాత :ఎ ఎం.రత్నం
సంస్థ : శ్రీ సూర్యా ఫిలింస్
గాత్రం : జేసుదాసు
సంగీతం : రాజ్-కోటి
విడుదల :1992
పల్లవి:
ఇదేలే తరతరాల చరితం జ్వలించే జీవితాల కధనం

పగేమో ప్రాణమయ్యేనా ప్రేమలే దూరమయ్యేనా నిరాశే నింగి కి ఎగసేనా అశలే రాలిపోయెనా

చరణం1:
ఒడిలో పెరిగిన చిన్నారిని ఎరగా చేసినది ఆ ద్వేషము
కధమారదా ఈ బలి ఆగదా
మనిషె పశువుగ మారితే కసిగా శిశువును కుమ్మితే

అభము శుభము ఎరుగని వలపులు ఒడిపోయేనా
ఇదేలే తరతరాల చరితం జ్వలించే జీవితాల కధనం
ఇదేలే తరతరాల చరితం జ్వలించే జీవితాల కధనం
పగేమో ప్రాణమయ్యేనా ప్రేమలే దూరమయ్యేనా నిరాశే నింగి కి ఎగసేనా అశలే రాలిపోయెనా
ఇదేలే తరతరాల చరితం జ్వలించే జీవితాల కధనం
చరణం2:
విరిసి విరియని పూతొటలొ రగిలే మంటలు చల్లారవా ఆర్పేదెలా ఒదార్చేదెలా
నీరె నిప్పుగ మారితే వెలుగే చీకటి ఊదితే
నీరె నిప్పుగ మారితే వెలుగే చీకటి ఊదితే
పొగలో సెగలో మమతల పువ్వులు కలిపోయేనా
ఇదేలే తరతరాల చరితం జ్వలించే జీవితాల కధనం
ఇదేలే తరతరాల చరితం జ్వలించే జీవితాల కధనం
పగేమో ప్రాణమయ్యేనా ప్రేమలే దూరమయ్యేనా నిరాశే నింగి కి ఎగసేనా అశలే రాలిపోయెనా
ఇదేలే తరతరాల చరితం జ్వలించే జీవితాల కధనం
|
No comments:
Post a Comment