Sep 18, 2007

మహానది

తారాగణం :కమల్ హాసన్,సుకన్య,తులసి,ఎస్ ఎన్.లక్ష్మి
సంగీతం : ఇళయరాజా
దర్శకత్వం :సంతాన భారతి
విడుదల :1993



పల్లవి:


గంగాశంకాస కావేరి శ్రీరంగేస మనోహరి
కళ్యాణకారి కలుసాని
నమస్తేస్తు శుభాచరి
ఆ ఆ ఆ ఆ ఆ ఆ

శ్రీరంగ రంగనాథుని దివ్యరూపమే చూడవే
శ్రీదేవి రంగనాయకి నామంసంతతం పాడవే
శ్రీరంగ రంగనాథుని దివ్యరూపమే చూడవే
శ్రీదేవి రంగనాయకి నామంసంతతం పాడవే
నీలవేణిలో నీటిముత్యాలు .....
కృష్ణవేణిలో అలలగీతాలు....
నీలవేణిలో నీటిముత్యాలు నీరజాక్షునికి పూలుగా
కృష్ణవేణిలో అలలగీతాలు కృష్ణగీతలే పాడగా
శ్రీరంగ రంగనాథుని దివ్యరూపమే చూడవే
శ్రీదేవి రంగనాయకి నామంసంతతం పాడవే

చరణం1:

కృష్ణాతీరాన అమరావతిలో శిల్పకళావాణి పలికిన శృతిలో
అలలై పొంగేను జీవన గీతం కలలే పలికించు మధుసంగీతం
చల్లగా గాలి పల్లకిలోన పాట ఊరేగగా
వెల్లువై గుండె పల్లెపదమల్లే పల్లవై పాడగా
శ్రీత్యాగ్రాజకీర్తనై సాగే తియ్యనీ జీవితం


శ్రీరంగ రంగనాథుని దివ్యరూపమే చూడవే
శ్రీదేవి రంగనాయకి నామంసంతతం పాడవే
నీలవేణిలో నీటిముత్యాలు నీరజాక్షునికి పూలుగా
కృష్ణవేణిలో అలలగీతాలు కృష్ణగీతలే పాడగా
శ్రీరంగ రంగనాథుని దివ్యరూపమే చూడవే
శ్రీదేవి రంగనాయకి నామంసంతతం పాడవే

చరణం2:

గంగను మరపించు ఈ కృష్ణవేణి వెలుగులు ప్రవహించు తెలుగింటి రాణి
పాపాల హరియించు పావనజలము పచ్చగ ఈ నేల పండించు ఫలము
ఈ ఏటి నీటిపాయలే తేటగీతులే పాడగా సిరులెన్నో పండి ఈ భువి స్వర్గలోకమై మారగా
కల్లకపటమే కానరాని ఈ పల్లెసీమలో

శ్రీరంగ రంగనాథుని దివ్యరూపమే చూడవే
శ్రీదేవి రంగనాయకి నామంసంతతం పాడవే
నీలవేణిలో నీటిముత్యాలు నీరజాక్షునికి పూలుగా
కృష్ణవేణిలో అలలగీతాలు కృష్ణగీతలే పాడగా
శ్రీరంగ రంగనాథుని దివ్యరూపమే చూడవే
శ్రీరంగ రంగనాథుని దివ్యరూపమే చూడవే
శ్రీదేవి రంగనాయకి నామంసంతతం పాడవే




~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments: