సాహిత్యం:వేటూరి
సంగీతం:మణిశర్మ
దర్శకత్వం:గుణశేఖర్
నిర్మాత:రమేష్ బాబు
సంస్థ:కృష్ణ ప్రొడక్సన్స్
విడుదల:2004
పల్లవి:
మధుర మధుర తర మీనాక్షి ,కంచి పట్టున కామాక్షి
మహిని మహిమ గల మీనాక్షి ,కాశీలో విశాలాక్షి
మధుర మధుర తర మీనాక్షి,కంచి పట్టున కామాక్షి
మహిని మహిమ గల మీనాక్షి,కాశీలో విశాలాక్షి
జాజి మల్లెలా ఘుమఘుమలా జావలీ
జాజి మల్లెలా ఘుమఘుమలా జావలీ
లేత సిగ్గుల సరిగమల జాబిలీ
అమ్మా మీనాక్షీ ఇది నీ మీనాక్షి
వరములు చిలక స్వరములు చిలక కరమున చిలక కలదాన
హిమగిరి చిలక శివగిరి చిలక మమతలు చిలక దిగిరావా

చరణం1:
శృంగారం వాగైనది ఆ వాగే వైగైనది
ముడిపెట్టే ఎరైనదీ విడిపొతె నీరైనది
భరత నాట్య సంభరిత నర్తని కూచిపూడి లో తకధిమితా
విశ్వనాథుని ఏకవీర ఆ తమిళ మహిళల వలపు కథ
మనసే మధురై కొలువైన తల్లి మా మీనాక్షి
ఎదలొ యమునై పొంగెటి ప్రేమకి నీ సాక్షి
వరములు చిలక స్వరములు చిలక కరమున చిలక కలదాన
హిమగిరి చిలక శివగిరి చిలక మమతలు చిలక దిగిరావా
చరణం2:
అందాలే అష్టొత్తరం చదివించే సొగసున్నది
సొగసంతా నీరాజనం అర్పించే మనసున్నది
మధురనేలు మా తెలుగు నాయకుల మధుర సాహితీ రసికతలో
కట్టబొమ్మ తొడగొట్టి లేచిన తెలుగు వీర ఘన చరితలలో
తెలుగు తమిళం జత కట్టెనెన్నడో మీనాక్షి
మనసు మనసు ఒకటైన జంటకి నీ సాక్షి
వరములు చిలక స్వరములు చిలక కరమున చిలక కలదాన
హిమగిరి చిలక శివగిరి చిలక మమతలు చిలక దిగిరావా
మధుర మధుర తర మీనాక్షి ,కంచి పట్టున కామాక్షి
మహిని మహిమ గల మీనాక్షి ,కాశీలో విశాలాక్షి
జాజి మల్లెలా ఘుమఘుమలా జావలీ
లేత సిగ్గుల సరిగమల జాబిలీ
అమ్మా మీనాక్షీ ఇది నీ మీనాక్షి
వరములు చిలక స్వరములు చిలక కరమున చిలక కలదాన
హిమగిరి చిలక శివగిరి చిలక మమతలు చిలక దిగిరావా
మధుర మధుర తర మీనాక్షి ,కంచి పట్టున కామాక్షి
మహిని మహిమ గల మీనాక్షి,కాశీలో విశాలాక్షి
|
1 comment:
వసంతం చిత్రంలోని "గాలీ చిరుగాలీ" పాట కావాలి.
Post a Comment