గాత్రం:జేసుదాసు
సంగీతం:రవి
నిర్మాత:అశ్వినిదత్
దర్శకత్వం:క్రాంతి కుమార్
విడుదల:1994
పల్లవి:
స్వరరాగ గంగా ప్రవాహమే
అంగాత్మ సంధాన యోగమే
కార్తే వసంతేతి కాళికే
పలికే కుహు గీతిక
గానసరసి రుణమాలిక
స్వరరాగ గంగా ప్రవాహమే
చరణం1:
కొండలలోపల నిండిన నింగిలో ఉరిమెను మేఘం ఇన్నాళ్ళకి
పిల్లనగ్రొవిలో పిలవని మోవిలో కురిసెను రాగం ఈనాటికి
మట్టింటి రాయే మాణిక్యమైపొయె సంగీత రత్ణాకరాన
స్వరసప్తకాలే కెరటాలు కాగ ఆ గంగ పొంగింది లోన
స్వరరాగ గంగా ప్రవాహమే
అంగాత్మ సంధాన యోగమే
కార్తే వసంతేతి కాళికే
పలికే కుహు గీతిక
గానసరసి రుణమాలిక
స్వరరాగ గంగా ప్రవాహమే
చరణం2:
చైతన్యవర్ణాల ఈ చైత్ర సుమవీధి వినుపించు రాగాలనంతాలులే
ఈ చక్రవాకాలు ఎగిరే చకోరాలు జగమంత విహరించు రాగాలులే
పిలిచే శకుంతాలు పలికే దిగంతాలు పులకింతలా పుష్యరాగాలులే
మలిసంధ్యదీపాలు గుడిగంటనాదాలు మౌనాక్షరి గాన వేదాలులే
స్వరరాగ గంగా ప్రవాహమే
అంగాత్మ సంధాన యోగమే
కార్తే వసంతేతి కాళికే
పలికే కుహు గీతిక
గానసరసి రుణమాలిక
స్వరరాగ గంగా ప్రవాహమే
స్వరరాగ గంగా ప్రవాహమే
|
No comments:
Post a Comment