తారాగణం:రాజేంద్రప్రసాద్,వాణివిశ్వనాథ్,బేబి షామిలి
గాత్రం:బాలు
సంగీతం:వంశి
దర్శకత్వం:వంశి
నిర్మాతలు:ఎం.లక్ష్మణకుమారచౌదరి,పి.పట్టాభిరామరావు
సంస్థ:పద్మప్రియ ఆర్ట్స్
విడుదల:1993
పల్లవి:
పాలనవ్వులలోన పగడాల వెలుగులు
బాల పలుకులోన పలకాలి చిలకలు
పైన పగటి వేషం ఒక వేడుకైనది
లోన తగని పాశం ఈ జోకరైనది
అమ్మ అమ్మ పూల రెమ్మ రెమ్మ నువ్వు ఆడే బొమ్మ నేను అవుతానమ్మ
పాలనవ్వులలోన పగడాల వెలుగులు
బాల పలుకులోన పలకాలి చిలకలు
పైన పగటి వేషం ఒక వేడుకైనది
లోన తగని పాశం ఈ జోకరైనది
అమ్మ అమ్మ పూల రెమ్మ రెమ్మ నువ్వు ఆడే బొమ్మ నేను అవుతానమ్మ
చరణం1:
చిలిపి మాటలు చిలికే పాట పేరడి
చురుకు చేతిలో చిరిగే పేక గారడి
చిట్టిపాప బెట్టు అదిహాటు ట్రాజెడి
రట్టుచేయి బెట్టు ఇది స్వీటు కామిడి
గువ్వ నువ్వు నేను నవ్వే నవ్వులోన పువ్వు పువ్వు వాన జల్లాయెను
కయ్యాలు నేటికి కట్టాయెను
చిన్నారి ఆటల పుట్టయెను
పాలనవ్వులలోన పగడాల వెలుగులు
బాల పలుకులోన పలకాలి చిలకలు
పైన పగటి వేషం ఒక వేడుకైనది
లోన తగని పాశం ఈ జోకరైనది
అమ్మ అమ్మ పూల రెమ్మ రెమ్మ నువ్వు ఆడే బొమ్మ నేను అవుతానమ్మ
చరణం2:
తగువుపాపతో చెలిమి చేసి జోకరు
బిగువులాగితే పొంగి పోయే హ్యుమరు
ఎత్తువేసి వస్తే ఎదురైన నేస్తమా
చిత్తుచేసి చేసినావే ఎదలోని బంధమా
చిన్న చిన్న లేత పొన్నా పొన్నా
ప్రేమకన్న మిన్న లేదు లేదోయన్న
కుందేలు జాబిలి ఫ్రెండాయెను
అందాల స్నేహము విందాయెను
పాలనవ్వులలోన పగడాల వెలుగులు
బాల పలుకులోన పలకాలి చిలకలు
పైన పగటి వేషం ఒక వేడుకైనది
లోన తగని పాశం ఈ జోకరైనది
అమ్మ అమ్మ పూల రెమ్మ రెమ్మ నువ్వు ఆడే బొమ్మ నేను అవుతానమ్మ
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
పాట ఇక్కడ వినండి.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
No comments:
Post a Comment