గాత్రం:చిత్ర
సంగీతం:ఎస్.ఏ.రాజ్ కుమార్
దర్శకత్వం:విక్రమన్
సంస్థ:సాయిదేవా ప్రొడక్సన్స్
విడుదల:2003

పల్లవి:

గాలి చిరుగాలి నిను చూసిందెవరమ్మా
వెళ్ళే నీ దారి అది ఎవరికి తెలుసమ్మా
రూపమే వుండని ఊపిరే నువ్వని
ఎన్నడు ఆగని పయనమే నీదని
గాలి చిరుగాలి నిను చూసిందెవరమ్మా
వెళ్ళే నీ దారి అది ఎవరికి తెలుసమ్మా
చరణం1:
కనురెప్ప మూసివున్న నిదరొప్పుకొను అన్నా
నిను నిలువరించిన ఓ స్వప్నమా
అమవాసలెన్నైన గ్రహణాలు ఏవైనా
నీ కలను దోచిన ఓ చంద్రమా
తన ఒడిలో వున్నది రాయో రత్నమో పోల్చదు నేలమ్మ
ఉలి గాయం చేయకపోతే ఈ శిల శిల్పం కాదమ్మ
మేలుకో మిత్రమా గుండెలో జ్వాలలే జ్యోతిగా మారగా
చికటే దారిగా వేకువే చేరగా
గాలి చిరుగాలి నిను చూసిందెవరమ్మా
వెళ్ళే నీ దారి అది ఎవరికి తెలుసమ్మా
చరణం2:
చలికంచె కాపున్న పొగమంచు పొమ్మన్నా
నీ రాక ఆపెన వాసంతమా
ఏ కొండ రాళ్ళైనా ఏ కోన ముళ్ళైనా
బెదిరేనా నీ వాన ఆషాడమా
మొలకెత్తే పచ్చని ఆశే నీలో వుంటే చాలు సుమా
కలకాలం నిన్ను అనచదు మన్ను ఎదిగే విత్తనమా
సాగిపో నేస్తమా నిత్యము తోడుగా నమ్మకం వుందిగా
ఓరిమే సాక్షిగా ఓటమే వుందిగా
గాలి చిరుగాలి నిను చూసిందెవరమ్మా
వెళ్ళే నీ దారి అది ఎవరికి తెలుసమ్మా
రూపమే వుండని ఊపిరే నువ్వని
ఎన్నడు ఆగని పయనమే నీదని
|
No comments:
Post a Comment