దర్శకత్వం:జంధ్యాల
సాహిత్యం:వేటూరి
నిర్మాత:ఎన్.క్రిష్ణంరాజు
విడుదల:1982
పల్లవి:
చినుకులా రాలి నదులుగా సాగి
వరదలై పొయి కడలిగా పొంగు
నీప్రేమ నాప్రేమ నీపేరే నాప్రేమ
నదివి నీవు కడలి నేను మరచిపోబోకుమా మమత నీవేసుమా
చినుకులా రాలి నదులుగా సాగి
వరదలై పొయి కడలిగా పొంగు
నీప్రేమ నాప్రేమ నీపేరే నాప్రేమ
చరణం1:
ఆకులు రాలే వేసవి గాలి నా ప్రేమ నిట్టూర్పులే
కుంకుమ పూసే వేకువ నీవై తేవాలి ఓదార్పులే
ప్రేమలు కోరే జన్మలలోనే నే వేచి వుంటానులే
జన్మలుదాటే ప్రేమనునేనై నే వెల్లువవుతానులే
ఆ చల్లనినేతాడులే
హిమములా రాలి సుమములై పూసి
ఋతువులై నవ్వి మధువులై పొంగు నీ ప్రేమ నా ప్రేమ నీ పేరే నా ప్రేమ
శిశిరమైన శిధిలమైనా విడిచిపోబోకుమా విరహమైపోకుమా
చరణం2:
తొలకరికోసం తొడిమను నేనై అల్లాడుతున్నానులే
తులకర మూగే పువ్వులకోసం వేసారుతున్నానులే
నింగికి నేల అంటిసలాడే ఆ పొద్దు రావాలిలే
నిన్నను నేడై రేపటి నీడై నా ముద్దు తీరాలిలే
ఆ తీరాలు చేరాలిలే
మౌనమై మెరిసి గానమై పిలిచి
కలలతో అలసి గగనమై ఎగసి
నీ ప్రేమ నా ప్రేమ తారాడే మన ప్రేమ
భువనమైనా గగనమైనా ప్రేమమయమే సుమా హ
ప్రేమ మనమే సుమా
చినుకులా రాలి నదులుగా సాగి
వరదలై పొయి కడలిగా పొంగు
నీప్రేమ నాప్రేమ నీపేరే నాప్రేమ
అహహ అహహ అహహ అహాహ
|
2 comments:
thanks for posting wonderful song
ఆణి ముత్యాల్లాంటి పాటలన్నీ ఒక దగ్గర చేర్చటం, మంచి ప్రయత్నం.
Thanks for posting all great melodies.
Post a Comment