Sep 21, 2007

సీతాకోకచిలుక

తారాగణం:కార్తిక్,ముచ్చెర్ల అరుణ,శరత్ బాబు,సిల్క్ స్మిత
గాత్రం:బాలు,శైలజ
సాహిత్యం:వేటూరి
సంగీతం:ఇళయరాజా
దర్శకత్వం:భారతిరాజా
నిర్మాత:ఎడిద నాగేశ్వరరావు
సంస్థ:పూర్ణోదయా మూవీ క్రియేషన్స్
విడుదల:1981




ఓం శతమానం భవతి శతాయు పురుష
శతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతి తిష్టతి

పల్లవి:

మాటే మంత్రము మనసే బంధము
ఈ మమతే ఈ సమతే మంగళ వాద్యము
ఇది కళ్యాణం కమనీయం జీవితం
ఓ మాటే మంత్రము మనసే బంధము
ఈ మమతే ఈ సమతే మంగళ వాద్యము
ఇది కళ్యాణం కమనీయం జీవితం
ఓ మాటే మంత్రము మనసే బంధము

చరణం1:

నీవే నాలో స్పందించినా
ఈ ప్రియ లయలో శృతి కలిసే ప్రాణమిదే
నేనే నీవుగా పువ్వూ తావిగా
సం యోగాల సంగీతాలు విరిసే వేళలో

మాటే మంత్రము మనసే బంధము
ఈ మమతే ఈ సమతే మంగళ వాద్యము
ఇది కళ్యాణం కమనీయం జీవితం

చరణం2:

నేనే నీవై ప్రేమించినా
ఈ అనురాగం పలికించే పల్లవివే
ఎద నా కోవెలా ఎదుటే దేవతా
వలపై వచ్చి వరమే ఇచ్చి కలిసే వేళలో

మాటే మంత్రము మనసే బంధము
ఈ మమతే ఈ సమతే మంగళ వాద్యము
ఇది కళ్యాణం కమనీయం జీవితం
ఓఓ లలలాలల లాలలాలల ఉహు ఉహు హు

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

1 comment:

Anonymous said...

mee daggara malle teegaku pandiri ole ane paata uunte cheppandi nenu ennalla nundo vetukutunnaanu