Sep 17, 2007

మాతృదేవోభవ

తారాగణం :మాధవి,నాజర్,తనికెళ్ళ భరణి
గాత్రం :చిత్ర
సాహిత్యం :వేటూరి
సంగీతం :కీరవాణి
నిర్మాత :కె.ఎస్.రామారావు
దర్శకత్వం :కె.అజెయ్ కుమార్
విడుదల :1993



పల్లవి:


వేణువై వచ్చాను భువనానికి గాలినై పోతాను గగనానికి
వేణువై వచ్చాను భువనానికి గాలినై పోతాను గగనానికి
మమతలన్ని మౌనగానం వాంఛలన్ని వాయులీనం
వేణువై వచ్చాను భువనానికి గాలినై పోతాను గగనానికి
మాతృ దేవొ భవ.. పితృ దేవొ భవ.. ఆచార్య దేవొ భవ

చరణం1:

ఏడుకొండలకైనా బండతానొక్కటే ఎడు జన్మల తీపి ఈ బంధమే
ఏడుకొండలకైనా బండతానొక్కటే ఎడు జన్మల తీపి ఈ బంధమే
నీ కంటిలొ నలక లో వెలుగు నేకనక నేను నేననుకుంటె ఎద చీకటె హరీ హరీ హరీ
రాయినై ఉన్నాను ఈ నాటికి రామ పాదము రాక ఏనాటికి


వేణువై వచ్చాను భువనానికి గాలినై పొతాను గగనానికి
వేణువై వచ్చాను భువనానికి గాలినై పొతాను గగనానికి

చరణం2:

నీరు కన్నీరాయె ఊపిరే బరువాయే నిప్పు నిప్పుగమారె నాగుండెలో ఆ ఆ ఆ
నీరు కన్నీరాయె ఊపిరే బరువాయే నిప్పు నిప్పుగమారె నాగుండెలో
ఆ నింగిలో కలిసి నా శూన్యబందాలు పుట్టిల్లు చేరే మట్టి ప్రాణాలు హరీ హరీ హరీ
రెప్పనై వున్నాను నీకంటికి పాపనై వస్తాను నీఇంటికి

వేణువై వచ్చాను భువనానికి గాలినై పోయాను గగనానికి
గాలినై పోయాను గగనానికి.......


||

2 comments:

హృదయ బృందావని said...

woooow Vihaari gaaru. super collection andi. eppudu modalu pettaaru ee blog. nenu choodane ledu intha varadu.

really it's very nice :). veelaithe audio koodaa pettandi.

మేధ said...

చాలా మంచి పాట అందించారు విహారి గారు.. ఈ పాట పిక్చరైజేషన్ కూడా చాలా బావుంటుంది.. ఈ పాటకి చిత్రగారికి జాతీయ అవార్డ్ వచ్చినట్లుంది.. ఇంకా ఇలాంటి మంచి పాటలని మరెన్నో అందించాలని కోరుకుంటున్నాను...