Sep 17, 2007

అమ్మ రాజీనామా

తారాగణం :శారద,సత్యనారాయణ,ప్రసాద్ బాబు,సాయికుమార్,కవిత
దర్శకత్వం :దాసరి నారాయణరావు
విడుదల :1991

పల్లవి:

పల్లవి:

ఎవరు రాయగలరూ అమ్మా అను మాట కన్న కమ్మని కావ్యం
ఎవరు పాడగలరూ అమ్మా అనురాగం కన్న తీయని రాగం
అమ్మేగా ...
అమ్మేగా తొలి పలుకు నేర్చుకున్న భాషకి
అమ్మేగా ఆదిస్వరం ప్రాణమనే పాటకి
ఎవరు రాయగలరు అమ్మా అను మాట కన్న కమ్మని కావ్యం
ఎవరు పాడగలరు అమ్మా అనురాగం కన్న తీయని రాగం

చరణం1:

అవతారమూర్తి అయినా అణువంతే ఫుడతాడు
అమ్మ పేగు పంచుకునే అంతవాడు అవుతాడు
అవతారమూర్తైనా అణువంతే ఫుడతాడు
అమ్మ పేగు పంచుకునే అంతవాడు అవుతాడు
అమ్మేగా ...
అమ్మేగా చిరునామా ఇంతటి ఘనచరితకి
అమ్మేగా కనగలదు అంత గొప్ప ఆమ్మకి

ఎవరు రాయగలరు అమ్మా అను మాట కన్న కమ్మని కావ్యం
ఎవరు పాడగలరు అమ్మా అనురాగం కన్న తీయని రాగం

చరణం2:

శ్రీరామరక్ష అంటూ నీళ్ళు పోసి పెంచింది
దీర్ఘాయురస్తు అంటూ నిత్యం దీవించింది
శ్రీరామరక్ష అంటూ నీళ్ళు పోసి పెంచింది
దీర్ఘాయురస్తు అంటూ నిత్యం దీవించింది
నూరేళ్ళు ఊ ఊ
నూరేళ్ళు ఎదిగి బ్రతుకు అమ్మ చేతి నీళ్ళతో
నడక నేర్చుకుంది బ్రతుకు అమ్మ చేతి వేళ్ళతో

||

No comments: