Sep 17, 2007

అంకురం

తారాగణం :రేవతి,శరత్ బాబు,ఓంపురి,బాలయ్య
గాత్రం :చిత్ర,బాలు
సంగీతం :హంసలేఖ
దర్శకత్వం :ఉమామహేశ్వరరావు
విడుదల :1993



పల్లవి:

ఎవరో ఒకరు ఎపుడొ అపుడు
ఎవరో ఒకరు ఎపుడొ అపుడు
నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు
అటో ఇటో ఎటో వైపు
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
మొదటి వాడు ఎప్పుడూ ఒక్కడే మరి
మొదటి అడుగు ఎప్పుడూ ఒంటరే మరి
వెనుక వచ్చువాళ్ళకు బాట అయినది..

ఎవరో ఒకరు ఎపుడొ అపుడు
నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు
అటో ఇటో ఎటో వైపు

చరణం1:

కదలరు ఎవ్వరూ వేకువ వచ్చినా
అనుకొని కొడి కూత నిదరపొదుగా..
జగతికి మేలుకొలుపు మానుకోదుగా..
మొదటి చినుకు సూటిగా దూకి రానిదే..
మబ్బు కొంగు చాటుగా ఒదిగి దాగితే..
వాన ధార రాదుగా నేల దారికి
ప్రాణమంటు లేదుగా బ్రతకటానికి..

ఎవరో ఒకరు ఎపుడొ అపుడు
నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు
అటో ఇటో ఎటో వైపు

చరణం2:

చెదరక పోదుగా చిక్కని చీకటి
మిణుగురు రెక్క చాటు చిన్ని కాంతికి..
దానికి లెక్క లేదు కాలరాతిరి..
పెదవి ప్రమిద నిలపని నవ్వు జ్యోతిని
రెప్ప వెనక ఆపని కంటి నీతిని
సాగలేక ఆగితే దారి తరుగునా?
జాలి చూపి తీరమే దరికి చేరునా..?


ఎవరో ఒకరు ఎపుడొ అపుడు
నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు
అటో ఇటో ఎటో వైపు

చరణం3:

యుగములు సాగినా నింగిని తాకక
ఎగసిన అలల ఆశ అలసిపోదుగా
ఓటమి ఒప్పుకుంటు ఆగిపోదుగా
ఎంత వేడి ఎండతో ఒల్లు మండితే
అంత వాడి ఆవిరై వెళ్ళి చేరదా
అంత గొప్ప సూర్యుడు కళ్ళు మూయడా
నల్ల మబ్బు కమ్మితే చల్లబారడా

ఎవరో ఒకరు ఎపుడొ అపుడు
నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు
అటో ఇటో ఎటో వైపు
అటో ఇటో ఎటో వైపు

||

No comments: