Sep 30, 2007

చిన్నబ్బాయి



పల్లవి:

ఆ ఆ ఆ ఆ ఆ అహా ఆ
నిన్న చూసిన ఉదయంకాదిది
కొత్తగా ఉంది సరికొత్తగా ఉంది
ఇంతవరకు ఇన్ని వింతలు
ఇంతవరకు ఇన్ని వింతలు ఎక్కడ దాచింది
కొత్తగా ఉంది సరికొత్తగా ఉంది
నిన్న చూసిన ఉదయంకాదిది
నిన్న చూసిన ఉదయంకాదిది


చరణం1:

చురుకుమంటు పొడిచిలేపే సూర్యకిరణం ఈవేళ
కలువ విరిసే చలువ కురిసే కలలు చూపిందే
వేడిగాలై వెంట తరిమే ఎండకాలం ఈవేళ
ఏడురంగుల ఇంద్రధనువై ఎదుట నిలిచిందే
ఈ మాయమర్మం నాదందువా నీలోని భావమే నాదందువా
ఈనాడే కలిగిన నీ మెలకువ చూపించెనేమో తొలివేకువ
ఈ సుప్రభాతం వినిపించు గీతం నీగుండెలోనే లేదందువా

నిన్న చూసిన ఉదయంకాదిది
నిన్న చూసిన ఉదయంకాదిది

చరణం2:

మంత్రమెవరో వేసినట్టు మట్టిబొమ్మే ఈవేళ
నమ్మలేని నాట్యకళతో నడిచివచ్చిందే
మాయ ఏదో జరిగినట్టు మంచుఋతువే ఈవేళ
వేల వన్నెల పూలు తొడిగి పలకరించిందే
నీకంటి ముందర ఈరంగులు నీలోనెదాగిన శ్రీకాంతులు
నీగుండె ముంగిట ఈ ముగ్గులు నీఉహలోని సంక్రాంతులు
నీలం విచిత్రం ఈ నవ్య చిత్రం సత్యం శివం సుందరం

నిన్న చూసిన ఉదయంకాదిది
కొత్తగా ఉంది సరికొత్తగా ఉంది
ఇంతవరకు ఇన్ని వింతలు
ఇంతవరకు ఇన్ని వింతలు ఎక్కడ దాచింది
కొత్తగా ఉంది సరికొత్తగా ఉంది
నిన్న చూసిన ఉదయంకాదిది
నిన్న చూసిన ఉదయంకాదిది

||

No comments: