
పల్లవి:
ఈ రేయి తీయనిది ఈ చిరుగాలి మనసైనది
ఈ హాయి మాయనిది ఇంతకుమించి ఏమున్నది
ఏవేవొ కొరికలు ఎదలొ ఝుమ్మని అంటున్నవి
ఆ కొంటె మల్లికలు అల్లనదాగి వింటున్నవి
చరణం1:
పన్నీటి తలపులు నిండగ ఇన్నాళ్ళ కలలే పండగ
పన్నీటి తలపులు నిండగ ఇన్నాళ్ళ కలలే పండగ
చిన్నారి చెలియ అపరంజి కలువ
చేరాలి కౌగిట జిలిబిలి నగవులా
ఏవేవొ కొరికలు ఎదలొ ఝుమ్మని అంటున్నవి
ఆ కొంటె మల్లికలు అల్లనదాగి వింటున్నవి
చరణం2:
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ అహహ ఆహహ
పరువాలు పల్లవి పాడగ నయనాలు సయ్యాటలాడగ
పరువాలు పల్లవి పాడగ నయనాలు సయ్యాటలాడగ
నిను చేరుకొగ నునుమేని తీగ
పులకించి పొయేను తొలకరి వలపుల
ఈ రేయి తీయనిది ఈ చిరుగాలి మనసైనది
ఈ హాయి మాయనిది ఇంతకుమించి ఏమున్నది
చరణం3:
ఎన్నెన్ని జన్మల బంధమో ఏ పూల నోముల పుణ్యమో
ఎన్నెన్ని జన్మల బంధమో ఏ పూల నోముల పుణ్యమో
నిన్ను నన్ను కలిపే నీ నీడ నిలిపే
అనురాగసీమల అంచులు దొరికే
ఈ రేయి తీయనిది ఈ చిరుగాలి మనసైనది
ఈ హాయి మాయనిది ఇంతకుమించి ఏమున్నది
|
No comments:
Post a Comment