Oct 17, 2007

సూత్రధారులు

తారాగణం:నాగేశ్వరరావు,మురళిమోహన్,భానుచందర్,సుజాత,రమ్యకృష్ణ
దర్శకత్వం:కె.విశ్వనాథ్
సంగీతం:కెవి.మహదేవన్
నిర్మాతలు:సుధాకర్,కరుణాకర్
విడుదల:1989



పల్లవి:

మహారాజ రాజశ్రీ మహనీయులందరికి వందనాలు వంద వందనాలు
మహారాజ రాజశ్రీ మహనీయులందరికి వందనాలు వంద వందనాలు
హరిహరులను సేవించే ఈ దాసులాడేటి తందనాలు తకిట తందనాలు
హరిహరులను సేవించే ఈ దాసులాడేటి తందనాలు తకిట తందనాలు
వందనాలు వంద వందనాలు తందనాలు తకిట తందనాలు

చరణం1:

సన్నాయి స్వరమెక్కి చిన్నారి బసవన్న
చెన్నార చిందాడ కన్నార కళ్ళార
సిరులిచ్చి దీవించే సింహాదిరప్పన్న
సిరిగజ్జలల్లాడ సెవులార విన్నారా
ముంగిళ్ళ బసవన్న మురిసి ఆడేవేళ
ముంగిళ్ళ బసవన్న మురిసి ఆడేవేళ
గుండె గుడిలో శివుడు మేలుకోవాల
కోదండరామన్న గోవుళ్ళగోపన్న
కోలాటమాడుతు కొలువు తీరాల

మహారాజ రాజశ్రీ మహనీయులందరికి వందనాలు వంద వందనాలు
తందనాలు తకిట తందనాలు వందనాలు వంద వందనాలు

||

No comments: