Oct 17, 2007

మాయాబజార్

తారాగణం:రామారావు,నాగేశ్వరరావు,ఎస్వీ.రంగారావు,సావిత్రి,గుమ్మడి
గాత్రం:మాధవపెద్ది సత్యం
సాహిత్యం:
పింగళి
సంగీతం:ఘంటసాల
దర్శకత్వం:కె.వి.రెడ్డి
నిర్మాతలు:చక్రపాణి,నాగిరెడ్డి
సంస్థ:విజయ పిక్చర్స్



పల్లవి:

అహహ్హహహ్హహ్హా వివాహభోజనంబు అహ్హహా
వివాహ భోజనంబు వింతైన వంటకంబు
వియ్యాలవారి విందు ఓహ్హోహ్హో నాకె ముందు
వివాహ భోజనంబు వింతైన వంటకంబు
వియ్యాలవారి విందు ఓహ్హోహ్హో నాకె ముందు
అహ్హహహ్హహహ్హ అహ్హహహ్హహహ్హ అహ్హహహ్హహహ్హహ

చరణం1:

ఔరౌర గారెలల్ల అయ్యారె బూరెలిల్ల
ఔరౌర గారెలల్ల అయ్యారె బూరెలిల్ల
ఓ హో రే అరెసెలుల్ల అహాహా అహాహా
ఇయెల్ల నాకె చెల్ల

వివాహ భోజనంబు వింతైన వంటకంబు
వియ్యాలవారి విందు ఓహ్హోహ్హో నాకె ముందు
అహ్హహహ్హహహ్హ అహ్హహహ్హహహ్హ అహ్హహహ్హహహహ

చరణం2:

భళీరె లడ్డు లందు భక్షేణి బోణి ఇందు
భళీరె లడ్డు లందు భక్షేణి బోణి ఇందు
భలే జిలాబి ముందు అహ్హహహ్హహహ
ఇయెల్ల నాకే విందు

వివాహ భోజనంబు వింతైన వంటకంబు
వియ్యాలవారి విందు ఓహ్హోహ్హో నాకె ముందు
అహ్హహహ్హహహ్హ అహ్హహహ్హహహ్హ అహ్హహహ్హహహ్హాహా

చరణం3:

మజారే అప్పడాలు పులిహోర దప్పళాలు
మజారే అప్పడాలు పులిహోర దప్పళాలు
వహ్వారే పాయసాలు అహా హాహాహా
ఇవెల్ల నాకే చాలు

వివాహ భోజనంబు వింతైన వంటకంబు
వియ్యాలవారి విందు ఓహ్హోహ్హో నాకె ముందు
అహ్హహహ్హహహ్హ అహ్హహహ్హహహ్హ అహ్హహహ్హహహ్హాహ
అహ్హహహ్హహహ్హ అహ్హహహ్హహహ్హ అహ్హహహ్హహహ్హాహ

||

No comments: