May 3, 2008

తోడూ నీడా

తారాగణం:రామారావు,భానుమతి,జమున,ఎస్వీఅర్
గాత్రం:సుశీల
సాహిత్యం:సముద్రాల
సంగీతం:కె.వి.మహదేవన్
దర్శకత్వం:ఆదుర్తి సుబ్బారావు
విడుదల:1965



పల్లవి:

ఆయి ఆయి ఆయి ఆయి
అత్త ఒడి పువ్వువలే మెత్తనమ్మ అదమరచి హాయిగ ఆడుకొమ్మ
అత్త ఒడి పువ్వువలే మెత్తనమ్మ అదమరచి హాయిగ ఆడుకొమ్మ
ఆడుకొని ఆడుకొని అలసిపొతివా
ఆడుకొని ఆడుకొని అలసిపొతివా.. అలుపుతీర బజ్జోమ్మ అందాలబొమ్మ
అత్త ఒడి పువ్వువలే మెత్తనమ్మ అదమరచి హాయిగ ఆడుకొమ్మ


చరణం:1

అమ్మలు కన్నులు తమ్మి పూవుల్లు
అమ్మలు కన్నులు తమ్మి పూవుల్లు
తమ్మి పూవులు పూయు తలిరు వెన్నెల్లు
తమ్మి పూవులు పూయు తలిరు వెన్నెల్లు
ఆ వెన్నెలను మూసేనే కన్నీటి జల్లు
వెన్నెలను మూసేనే కన్నీటి జల్లు
కన్నీరు రానీకు కరుగు నెడదల్లు
ఆయి ఆయి
అత్త ఒడి పువ్వువలే మెత్తనమ్మ అదమరచి హాయిగ ఆడుకొమ్మ


చరణం:2

కనిపించే దేవుళ్ళు కమ్మని పాపల్లు
కనిపించే దేవుళ్ళు కమ్మని పాపల్లు
కనిపెంచే తల్లికి కన్నుల జ్యోతుల్లు
కనిపెంచే తల్లికి కన్నుల జ్యోతుల్లు
వెయ్యాలి పాపాయి తప్పటడుగుల్లు
వెయ్యాలి పాపాయి తప్పటడుగుల్లు
చెయ్యాలి ఆ పైన గొప్ప చేష్టలు
ఆయి ఆయి ఆయి ఆయి
లాలి లాలి లాలి లాలి
అత్త ఒడి పువ్వువలే మెత్తనమ్మ అదమరచి హాయిగ ఆడుకొమ్మ
అత్త ఒడి పువ్వువలే మెత్తనమ్మ అదమరచి హాయిగ ఆడుకొమ్మ


||

No comments: