పల్లవి:
నాణ్యమైన సరుకుంది లాహిరి భలే నాణ్యమైన సరుకుంది లాహిరి
మీరు బోణీ చేసారంటే కోరుమిల్లి జాంగిరి
నాణ్యమైన సరుకుంది లాహిరి భలే నాణ్యమైన సరుకుంది లాహిరి
చరణం1:
చంద్రలేఖ వాయలు జనకు జనకు పాయలు...ఔను ఔను ఔను
చంద్రలేఖ వాయలు జనకు జనకు పాయలు
బస్తీలో పేరు మోసిన భలేరాముడు చీరలు అహ భలేరాముడు చీరలు
నాణ్యమైన సరుకుంది లాహిరి భలే నాణ్యమైన సరుకుంది లాహిరి
చరణం2:
మూట విప్పి చూపిస్తే మురిసి భ్రమసిపోతారు...ఔను ఔను ఔను
మూట విప్పి చూపిస్తే మురిసి భ్రమసిపోతారు
తల తాకట్టైన పెట్టి తప్పకుండా కొంటారు...తప్పకుండా కొంటారు
చీనా సిల్కు,షిఫాన్ తల్కు,కన్ను చెదురు కంచిపట్టు ఓ ఓ ఓ ఓ ఓ
చీనా సిల్కు,షిఫాన్ తల్కు,కన్ను చెదురు కంచిపట్టు
అత్తాకోడలు అంచులు,పెద్దాపురం పంచెలు
నాణ్యమైన సరుకుంది లాహిరి భలే నాణ్యమైన సరుకుంది లాహిరి
హా బొంబాయి గుడ్డలు,రవికెల గుడ్డలు,చొక్కా గుడ్డలు,పరికిణి గుడ్డలు
చరణం3:
లంగాలు,లుంగీలు,రంగురంగు ఓణీలు చెయ్యండి బోణీలు...చెయ్యండి బోణీలు
అప్టుడేటు జాకెట్లు,అందమైన దుప్పట్లు...ఔను ఔను ఔను
ఇవి అప్టుడేటు జాకెట్లు,అందమైన దుప్పట్లు
కోటింగులు,షూటింగులు,కొత్త కొత్త ప్రింటింగులు ఓ ఓ ఓ ఓ ఓ
కోటింగులు,షూటింగులు,కొత్త కొత్త ప్రింటింగులు
ఒక్కసారి చెయ్యి పడితే వదలలేరు డీరింగులు,వదలలేరు డీరింగులు
నాణ్యమైన సరుకుంది లాహిరి భలే నాణ్యమైన సరుకుంది లాహిరి
హా బొంబాయి గుడ్డలు,రవికెల గుడ్డలు,చొక్కా గుడ్డలు,పరికిణి గుడ్డలు
చరణం4:
మరులుపెట్టు అద్దకాలు,మంచి మంచి చీటీలు
వయసువాళ్ళు మెచ్చుకొనే వన్నె వన్నె చోళీలు...ఔను ఔను ఔను
కట్టుబడికి,పెట్టుబడికి చౌకగాను గిట్టుబడికి ఓ ఓ ఓ ఓ ఓ
అసలు ధరకే అమ్ముతాను,అమ్మతోడు నమ్మండి...అమ్మమ్మతోడు నమ్మండి
నాణ్యమైన సరుకుంది లాహిరి భలే నాణ్యమైన సరుకుంది లాహిరి
మీరు బోణీ చేసారంటే కోరుమిల్లి జాంగిరి
నాణ్యమైన సరుకుంది లాహిరి భలే నాణ్యమైన సరుకుంది లాహిరి
లాహిరి లాహిరి లాహిరి
|
No comments:
Post a Comment