సంగీతం: రాజ్-కోటి
దర్శకత్వం: వి.మధుసూదనరావు
సంస్థ: గోపీకృష్ణ కంబైన్స్
విడుదల:1988
పల్లవి:
స్నేహానికన్న మిన్న లోకానలేదురా
స్నేహానికన్న మిన్న లోకానలేదురా
కడదాక నీడలాగ నిను వీడిపోదురా
నీ గుండెలో పూచేటిది
నీ శ్వాసగ నిలిచేటిది ఈస్నేహమొకటేనురా
స్నేహానికన్న మిన్న లోకానలేదురా
చరణం1:
తులతూగే సంపదలున్నా స్నేహానికి సరిరావన్న ఆ ఆ ఓ ఓ
పలుకాడే బంధువులున్నా నేస్తానికి సరికారన్న
మాయామర్మం తెలియని చెలిమే ఎన్నడు తరగని పెన్నిధిరా
ఆ స్నేహమే నీ ఆస్తిరా,నీ గౌరవం నిలిపేనురా
సందేహమేలేదురా
స్నేహానికన్న మిన్న లోకానలేదురా
కడదాక నీడలాగ నిను వీడిపోదురా
చరణం2:
త్యాగానికి అర్ధం స్నేహం ,లోభానికి లొంగదు నేస్తం ఓ ఓ ఓ
ప్రాణానికి ప్రాణం స్నేహం, రక్తానికి రక్తం నేస్తం
నీది నాదను భేదం లేనిది నిర్మలమైనది స్నేహమురా
ధృవతారలా స్థిరమైనది ఈ జగతిలో విలువైనది ఈ స్నేహమొకటేనురా
స్నేహానికన్న మిన్న లోకానలేదురా
కడదాక నీడలాగ నిను వీడిపోదురా
నీ గుండెలో పూచేటిది
నీ శ్వాసగ నిలిచేటిది ఈస్నేహమొకటేనురా
|
No comments:
Post a Comment