తారాగణం:రంగనాథ్,జయప్రద,దీప
గాత్రం:బాలు
సంగీతం:సత్యం
దర్శకత్వం:సింగీతం శ్రీనివాసరావు
విడుదల:1977
పల్లవి:
మధు మాస వేళలో మరుమల్లె తోటలో
మధు మాస వేళలో మరుమల్లె తోటలో
మనసైన చిన్నది లేదేలనో
మధు మాస వేళలో మరుమల్లె తోటలో
చరణం1:
ఆడింది పూల కొమ్మ పాడింది కోయిలమ్మ
అనురాగ మందిరంలో కనరాదు పైడిబొమ్మ
ప్రణయాలు పొంగే వేళ ప్రణయాలు పొంగే వేళ
నాలోన రగిలే ఎదో జ్వాల
మధు మాస వేళలో మరుమల్లె తోటలో
చరణం2:
ఉదయించె భానుదీపం వికసించలేదు కమలం
నెల రాజు వ్రాత కోసం లేచింది కన్నెకుముదం
వలచింది వేదనకేనా వలచింది వేదనకేనా
జీవితమంత దూరాలేన
మధు మాస వేళలో మరుమల్లె తోటలో
మనసైన చిన్నది లేదేలనో
మధు మాస వేళలో మరుమల్లె తోటలో
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
No comments:
Post a Comment