Aug 18, 2008

పూజ

తారాగణం:రామకృష్ణ,వాణిశ్రీ,మంజుల,సావిత్రి
గాత్రం:బాలు,వాణి జయరాం
సాహిత్యం:దాశరధి
సంగీతం:రాజన్-నాగేంద్ర
సంస్థ:ఏ.వి.ఎం



పల్లవి:

ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది
ఎన్నటికి మాయని మమత నాది నీది
ఒక్క క్షణం నిను వీడి నేనుండలేను
ఒక్క క్షణం నీ విరహం నే తాళలేను
ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది
ఎన్నటికి మాయని మమత నాది నీది

చరణం1:

పున్నమి వెన్నెలలోన పొంగులు కడలి
నిన్నే చూసిన వేళ విందులు చెలిమి
ఒహొహొహొ నువ్వు కడలివయితే నే నదిగమారి
చిందులు వేసి వేసి నిన్ను చేరనా
చేరనా చేరనా
ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది
ఎన్నటికి మాయని మమత నాది నీది

చరణం2:

విరిసిన కుసుమము నీవై మురిపించేవు
జాబిలి నేనై నిన్ను పెనవేసేను
ఓహొహొ మేఘము నీవై నెమలిని నేనై
ఆశతో నిన్ను చూసి చూసి ఆడనా ఆడనా ఆడనా
ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది
ఎన్నటికి మాయని మమత నాది నీది


చరణం3:

కోటి జన్మలకయినా కోరెదొకటే
నాలో సగమై ఎప్పుడు,నేనుండాలి
ఒహొహొహొ నీవున్న వేళ ఆ స్వర్గమేల
ఈ పొందు ఎల్లవేళలందు ఉండని
ఉండని ఉండని
ఎన్నెన్నో ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది
ఎన్నటికి ఎన్నటికి మాయని మమత నాది నీది
ఒక్క క్షణం నిను వీడి నేనుండలేను
అహాహ హహ ఒహో హొహొహొ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments: