గాత్రం:బాలు,జానకి
పల్లవి:
నీ కౌగిలిలో తలదాల్చి
నీ చేతులలో కనుమూసి
జన్మ జన్మకు జతగ మసలే వరమే నన్ను పొందని
నీ కౌగిలిలో తలదాల్చి
చరణం1:
చల్లగ కాసే పాల వెన్నెల నా మనసేదో వివరించు
అల్లరి చేసి ఓ చిరు గాలి నా కోరికలే వినిపించు
నా కోవెలలో స్వామివి నీవై వలపే దివ్వెగ వెలిగించు
నీ కౌగిలిలో తలదాల్చి
నీ చేతులలో కనుమూసి
జన్మ జన్మకు జతగ మసలే వరమే నన్ను పొందని
నీ కౌగిలిలో తలదాల్చి
చరణం2:
నింగి సాక్షి నేల సాక్షి
నిన్ను వలచిన నా మనసే సాక్షి
మనసులోన మనుగడలోన నాలో నీవే సగపాలు
వేడుకలోను వేదనలోను పాలు తేనేగ ఉందాము
నీ కౌగిలిలో తలదాల్చి
నీ చేతులలో కనుమూసి
జన్మ జన్మకు జతగ మసలే వరమే నన్ను పొందని
నీ కౌగిలిలో తలదాల్చి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
No comments:
Post a Comment