Aug 31, 2008

బంగారుపాప

గాత్రం:ఏ.ఎం.రాజా,సుశీల



పల్లవి:

ఓహో ఓ ఓ ఓ ఓ
యవ్వన మధువనిలో వన్నెల పువ్వుల ఉయ్యాల
యవ్వన మధువనిలో వన్నెల పువ్వుల ఉయ్యాల
ఉయ్యాల జంపాల ఉయ్యాల జంపాల
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
జీవన మధువనిలో పచ్చని తీగల ఉయ్యాల
జీవన మధువనిలో పచ్చని తీగల ఉయ్యాల
ఉయ్యాల జంపాల ఉయ్యాల జంపాల


చరణం1:

బ్రతుకే ఎలమావితోట మదిలో మకరందపు తేట
బ్రతుకే ఎలమావితోట మదిలో మకరందపు తేట
అడుగడుగున పువ్వులబాట అని చాటే కోయిలపాట
ఆ ఆ ఆ అడుగడుగున పువ్వులబాట అని చాటే కోయిలపాట
ఉయ్యాల జంపాల ఉయ్యాల జంపాల
ఉయ్యాల జంపాల


చరణం2:

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
అలనల్లన నా మదిలోన పలికే బంగారు వీణ
అలనల్లన నా మదిలోన పలికే బంగారు వీణ
నులిమెత్తని అంగులిహాని ఈ తీగలు మీటెను గాని
నులిమెత్తని అంగులిహాని ఈ తీగలు మీటెను గాని
ఆ ఆ ఆ ఆ ఓ ఓ ఆ ఆ ఆ ఆ
ఉయ్యాల జంపాల ఉయ్యాల జంపాల

||

No comments: