Aug 30, 2008

నీకోసం

తారాగణం: రవితేజ,మహేశ్వరి
గాత్రం:కౌసల్య,ఆర్పి.పట్నాయక్
సంగీతం:ఆర్పి.పట్నాయక్
సాహిత్యం:సాహితి
దర్శకత్వం: శ్రీను వైట్ల
విడుదల: 1999



పల్లవి:

నీకోసం నీకోసం నీకోసం లాలలా నీకోసం
ఎప్పుడు లేని ఆలోచనలు ఇప్పుడే కలిగెను ఎందుకు నాలో నీకోసం నీకోసం
ఈ లోకమిలా ఏదో కలలా నాకంతా కొత్తగ వింతగ కనిపిస్తూ ఉంది
నీకోసం నీకోసం నీకోసం లాలలా నీకోసం

చరణం1:

నాలో ఈ ఇది ఏ రోజు లేనిది ఏదో అలజడి నీతోనే మొదలిది
నువ్వేనాకని పుట్టుంటావని ,ఒంటిగా నీ జంటకే ఉన్నాను నే నిన్నాళ్ళుగా
నీకోసం నీకోసం నీకోసం లాలలా నీకోసం

చరణం2:

నాలో ప్రేమకి ఒక వింతే ప్రతీది వీణే పలుకని స్వరమే నీ గొంతుది
మెరిసే నవ్వది మోనాలిసది ఈ నిజం ఇక కాదనే ఏ మాటనూ నే నమ్మనూ

ఎప్పుడు లేని ఆలోచనలు ఇప్పుడే కలిగెను ఎందుకు నాలో నీకోసం నీకోసం
ఈ లోకమిలా ఏదో కలలా నాకంతా కొత్తగ వింతగ కనిపిస్తూ ఉంది
నీకోసం నీకోసం నీకోసం లాలలా నీకోసం


||

No comments: