సాహిత్యం:ఆరుద్ర

పల్లవి:
ఓ సోదర సోదరీమణులారా ఆదరించి నా మాట వింటారా
వింటాం చెప్పు
ప్రేమించి పెళ్ళి చేసుకో నీ మనసంత హాయి నింపుకో
ప్రేమించి పెళ్ళి చేసుకో
చరణం1:
వరుణి వలపేమిటో వధువు తలపేమిటో
తెలుసుకోలేక పెళ్ళిళ్ళు జరిపించినా
వరుణి వలపేమిటో వధువు తలపేమిటో
తెలుసుకోలేక పెళ్ళిళ్ళు జరిపించినా
తెలిసి కట్నాలకై బ్రతుకు బలి చేసినా
కడకు మిగిలేది ఎడమోము పేడమోములె
ప్రేమించి పెళ్ళి చేసుకో నీ మనసంత హాయి నింపుకో
ప్రేమించి పెళ్ళి చేసుకో
చరణం2:
మనిషి తెలియాలిలే మనసు కలవాలిలే
మరచి పోలేని స్నేహాన కరగాలిలే
మనిషి తెలియాలిలే మనసు కలవాలిలే
మరచి పోలేని స్నేహాన కరగాలిలే
మరచి పోలేని స్నేహాన కరగాలిలె
మధుర ప్రణయాలు మనువుగా మారాలిలే
మారి నూరేళ్ళ పంటగా వెలగాలిలే
ప్రేమించి పెళ్ళి చేసుకో నీ మనసంత హాయి నింపుకో
ప్రేమించి పెళ్ళి చేసుకో
చరణం3:
నలుడు ప్రేమించి పెళ్ళాడే దమయంతిని
వలచి రుక్మిణియే పిలిపించె శ్రీక్రిష్ణుని
నలుడు ప్రేమించి పెళ్ళాడే దమయంతిని
వలచి రుక్మిణియే పిలిపించె శ్రీక్రిష్ణుని
తొలుత మనసిచ్చి మనువాడే దుష్యంతుడు
పాత వరవళ్ళు దిద్దాలి మీరందరు
ప్రేమించి పెళ్ళి చేసుకో నీ మనసంత హాయి నింపుకో
ప్రేమించి పెళ్ళి చేసుకో
|
No comments:
Post a Comment