Aug 27, 2008

మయూరి

గాత్రం:శైలజ



పల్లవి:

ఈ పాదం ఇలలొన నాట్య వేదం
ఈ పాదం నటరాజుకే ప్రమోదం
కాల గమనాల గమకాల గ్రంధం
ఈ పాదం ఇలలొన నాట్య వేదం
ఈ పాదం నటరాజుకే ప్రమోదం

చరణం1:

ఈ పాదమే మిన్నాగు తలకు అందం
ఈ పాదమే ఆ నాటి బలికి అంతం
తనలోని గంగమ్మ ఉప్పొంగగా
ఇలలోనీ ఆ గౌతమే పొంగగా
పాట పాటలో తను చరణ మైన వేళ
కావ్య గీతిలో తను పాదమైన వేళ
గానమే తన ప్రాణమై లయలు హొయలు విరిసె
ఈ పాదం ఇలలొన నాట్య వేదం
ఈ పాదం నటరాజుకే ప్రమోదం

చరణం2:

ఈ పాదమే ఆ సప్తగిరికి శిఖరం
ఈ పాదమే ఈ భద్ర కమల మధుపం
వాగ్గేయ సాహిత్య సంగీతమై
త్యాగయ్య చిత్రాల శ్రీగంధమై
ఆ పాదమే ఇల అన్నమయ్య పదమై
ఆ పాదమే వరదయ్య నాట్య పదమై
తుంబుర వర నారద మునులూ జనులూ కొలిచే ఈ పాదం

ఈ పాదం ఇలలొన నాట్య వేదం
ఈ పాదం నటరాజుకే ప్రమోదం
కాల గమనాల గమకాల గ్రంధం
ఈ పాదం ఇలలొన నాట్య వేదం
ఈ పాదం నటరాజుకే ప్రమోదం

||

No comments: