Sep 8, 2008

మనీ మనీ

తారాగణం:చక్రవర్తి,చిన్నా,జయసుధ,సురభి,రేణుక,కోట,పరేష్ రావల్
సంగీతం:శ్రీ
దర్శకత్వం:శివనాగేశ్వరరావు
నిర్మాత:రాంగోపాల్‌వర్మ



పల్లవి:

ఊరువాడ హోరుమన్న పేరు విన్న
పోరగాడ కోరి నిన్నే చేరుకున్న
ఊరువాడ హోరుమన్న పేరు విన్న
పోరగాడ కోరి నిన్నే చేరుకున్న
పోరు నష్టం పొందు లాభం ఫోజులెందుకురా
మంచి మూక మించనీయక మోజు విందుకురా
మహావీరా మాట వినవేర మగాడల్లే మనసు పడవేరా
ఉహూ అనక సుఖాలెనక లగెత్తగ సరైన ముహూర్తమిదెరా ఇలారా

చరణం1:

లలలలలలా లలలలలలా లలలలలలా లాలాలాల
అలా నీ చూపు చిరాగ్గ చూసినా
చలో నీ షేపు సలమే చేయదా
పడేసే ఊపు పరాగ్గా తాకినా
గులాబి రూపు గులామై వాలదా
ఎంతసేపలా గుడ్లగూబలా మిటకరింపుతో సరిపెడతావోయ్
చింత చచ్చినా పులుపు తీరని గుటక మింగుతూ నిలబడతావు
సద్దు ఉంటే సొంతమౌతా చూసుకో, సైగ చేసి సంగతేంటో పోల్చుకో
భలేగుందే భామ భాగోతం, మెలేసిందే మాయ మొగమాటం
నహీ అంటే పరువు పోదా, సరేనని తెగించి దిగాల్గ తేలేనా తెలిగ్గా

ఊరువాడ హోరుమన్న పేరు విన్న
పోరగాడ కోరి నిన్నే చేరుకున్న

చరణం2:

గలాటా మేళం వలేసే వేళకి వదిల్తే పోదు మరీ కుర్రాళ్ళకి
కులాసా తాళం కలేసే గోలకి జవానీ రాదు మళ్ళీ ముసలాళ్ళకి
ఎనకాముందని ఇరగనున్నది ఎగురుతున్న ఈ ఏళాకోలం
జబరుదస్తుగా తిరుగుతున్నది దిగని మత్తులో గందరగోళం
సందట్లోనే సడేమియా అనుకోవయా
సందుచూసి సరసంలో పడిపోవయ
కమానంది ఖైదుతో కాలం ఎహ్హే యమాగుంది ఊగే భూగోళం అహ
తమాషాగ తలాడిస్తూ అటుఇటు ఎదేదో ఎలగో అయ్యింది ఇయ్యాళ

ఊరువాడ హోరుమన్న పేరు విన్న
పోరగాడ కోరి నిన్నే చేరుకున్న
ఊరువాడ హోరుమన్న పేరు విన్న
పోరగాడ కోరి నిన్నే చేరుకున్న
పోరు నష్టం పొందు లాభం ఫోజులెందుకురా
మంచి మూక మించనీయక మోజు విందుకురా
మహావీరా మాట వినవేర మగాడల్లే మనసు పడవేరా
ఉహూ అనక సుఖాలెనక లగెత్తగ సరైన ముహూర్తమిదెరా ఇలారా

||

1 comment:

siva said...

u have did an excellent job....in some movies details were not give ....give if u know