
పల్లవి:
తెల్లచీర కట్టుకున్నదెవరికోసము
మల్లెపూలు పెట్టుకున్నదెవరికోసము
తెల్లచీర కట్టుకున్నదెవరికోసము
మల్లెపూలు పెట్టుకున్నదెవరికోసము
తెల్లచీర కట్టుకున్నదెవరికోసము
మల్లెపూలు పెట్టుకున్నదెవరికోసము
తెల్లచీర కట్టినా మల్లెపూలు పెట్టినా
కల్లకపటమెరుగని మనసుకోసము
తెల్లచీర కట్టినా మల్లెపూలు పెట్టినా
కల్లకపటమెరుగని మనసుకోసము
మనసులోని చల్లని మమతకోసము
తెల్లచీర కట్టుకున్నదెవరికోసము
కల్లకపటమెరుగని మనసుకోసము
చరణం1:
దాచుకున్న మమతలన్ని ఎవరికోసము
దాపరికం ఎరుగని మనిషికోసము
దాచుకున్న మమతలన్ని ఎవరికోసము
దాపరికం ఎరుగని మనిషికోసము
దాగని యవ్వనం ఎవరికోసము
దాచుకొని ఎలుకొనే ప్రియునికొసము
తెల్లచీర కట్టుకున్నదెవరికోసము
కల్లకపటమెరుగని మనసుకోసము
చరణం2:
పొద్దంత కలవరింత ఎవరికోసము
నిద్దురైన రానీ నీకొసము
పొద్దంత కలవరింత ఎవరికోసము
నిద్దురైన రానీ నీకొసము
తెల్లచీర కట్టుకున్నదెవరికోసము
కల్లకపటమెరుగని మనసుకోసము
చరణం3:
నింగి నేల కలిసినది ఎందుకోసము
నీవు నన్ను చేరదీసినందుకోసము
నింగి నేల కలిసినది ఎందుకోసము
నీవు నన్ను చేరదీసినందుకోసము
నేల మీద ఒక్కరై సాగిపోదము
నింగిలోన చుక్కలై నిలిచిపోదము
తెల్లచీర కట్టుకున్నదెవరికోసము
మల్లెపూలు పెట్టుకున్నదెవరికోసము
తెల్లచీర కట్టినా మల్లెపూలు పెట్టినా
కల్లకపటమెరుగని మనసుకోసము
మనసులోని చల్లని మమతకోసము
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
No comments:
Post a Comment