
పల్లవి:
మౌనం గానం మధురం మాధూరాక్షరం
దేహం ప్రాణం కలిపే మంత్రాక్షరం
నయన సంగీతం హృదయ సందేశం
ఈ సాంధ్య దీపాలు వెలిగిన గుడిలో
మౌనం గానం మధురం మాధూరాక్షరం
దేహం ప్రాణం కలిపే మంత్రాక్షరం
చరణం1:
చైత్ర పవనాలు వీచే మైత్రి గంధాలు పూచేను
వయసు ముంగిళ్ళు తీసి వలపులే ముగ్గు లేసెను
సుమ వీధుల్లో భ్రమరాలెన్నో
చెలి కన్నుల్లో భ్రమలెన్నెనో
సాగేనులే శ్రుతిలో కృతిగా
మౌనం గానం మధురం మాధూరాక్షరం
దేహం ప్రాణం కలిపే మంత్రాక్షరం
చరణం2:
అరుణ చరణాల లోనే హృదయ కిరణాలు వెలిగేను
ముదిత పాదాల మువ్వే మువ్వ గోపాల పాడేను
అవి మోహాలో మధు దాహలో
చెలి హాసాలో తొలి మాసాలో
హంసధ్వని కలలే కనగా
మౌనం గానం మధురం మాధూరాక్షరం
దేహం ప్రాణం కలిపే మంత్రాక్షరం
నయన సంగీతం హృదయ సందేశం
ఈ సాంధ్య దీపాలు వెలిగిన గుడిలో
మౌనం గానం మధురం మాధూరాక్షరం
దేహం ప్రాణం కలిపే మంత్రాక్షరం
|
No comments:
Post a Comment