Sep 17, 2008

ఘర్షణ

గాత్రం:బాలు,చిత్ర



పల్లవి:

నీవే అమరస్వరమే సాగే శృతిని నేనే
నీ మనసు నీ మమత వెలిసేనే నాకోసం
నీలో సర్వం నా సొంతం
నీవే అమరస్వరమే సాగే శృతిని నేనే

చరణం1:

పలికే నీ అధరాలు చిలికేనే మధురాలు
నింగి వీడి నేల జారిన జాబిలి
మురిసే నీలో అందం కురిసే ఊహల గంధం
మల్లెపూల బంధమీవు ఓ చెలి
అంతులేనిదీ కథ అందరాని సంపద
రాగబంధనం అనురాగ చందనం
అంతులేనిదీ కథ అందరాని సంపద
రాగబంధనం అనురాగ చందనం
నా ధ్యాసలు నీవే నీ బసాలు నేనే
నా ఊహలు నీవే నీ ఊపిరి నేనే
నీలో సర్వం నా సొంతం
నీవే అమరస్వరమే సాగే శృతిని నేనే

చరణం2:

మెరిసే వన్నెల లోకం చిందే చల్లని గానం
తీయనైన ఆశలన్ని నీవనం
తరగని చెరగని కావ్యం ఊహలకిది అనుబంధం
భావరాగ బాష్యమే ఈ జీవితం
పలకరించు చూపులు, పాట పాడు నవ్వులు
కొత్త పల్లవి కొసరి ఆలపించెనే
పలకరించు చూపులు, పాట పాడు నవ్వులు
కొత్త పల్లవి కొసరి ఆలపించెనే
నూరేళ్ళు నీతో సాగాలి నేనే
నీ గుండెల్లోన నిండాలి నేనే


నీలో సర్వం నా సొంతం
నీవే అమరస్వరమే సాగే శృతిని నేనే
నీ మనసు నీ మమత, వెలిసేనే నీకోసం
నీలో సర్వం నా సొంతం
నీవే అమరస్వరమే సాగే శృతిని నేనే

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments: