Sep 18, 2008

అన్నమయ్య

గాత్రం:బాలు,కీరవాణి,ఆనంద్‌కుమార్,అనురాధా శ్రీరాం




గోవిందాశ్రిత గోకుల బృందా పావన జయజయ పరమానంద
గోవిందాశ్రిత గోకుల బృందా పావన జయజయ పరమానంద ఆ ఆ ఆ

హరినామమే కడు ఆనందకరము మరుగవో మరుగవో మరుగవో మనసా
హరినామమే కడు ఆనందకరము మరుగవో మరుగవో మరుగవో మనసా
హరినామమే కడు ఆనందకరము
రంగా రంగా రంగపతి రంగనాధ నీ సింగరాలె తరచాయ శ్రీరంగనాధ
రంగ రంగ రంగపతి రంగనాధ నీ సింగరాలె తరచాయ శ్రీరంగనాధ
రంగనాధ శ్రీరంగనాధ
రంగనాధ శ్రీరంగనాధ

రాముడు రాఘవుడు రవికులుడితడు భూమిజకు పతియైన పురుష నిధానము
రాముడు రాఘవుడు రవికులుడితడు భూమిజకు పతియైన పురుష నిధానము
రాముడు రాఘవుడు రవికులుడితడు
రాం రాం సితా రాం రాం సితా రాం
పెరిగిననాడు చూడరో పెద్ద హనుమంతుడు
పెరిగిననాడు చూడరో పెద్ద హనుమంతుడు పరగి నానా విద్యల బలవంతుడు
పెరిగిననాడు చూడరో పెద్ద హనుమంతుడు

వేదములు సుతింపగ వేడుకలు దైవారగ ఆదరించి దాసుల మోహన నరసింహుడు
మోహన నరసింహుడు మోహన నరసింహుడు

చక్కని తల్లికి చాంగుభళా తన చక్కెర మొవికి చాంగుభళా
చక్కని తల్లికి చాంగుభళా తన చక్కెర మొవికి చాంగుభళా
చక్కని తల్లికి చాంగుభళా
చక్కని తల్లికి చాంగుభళా

కట్టెదుర వైకుంఠము కాణాచయిన కొండ తెట్టెలాయె మహీమలే తిరుమల కొండ తిరుమల కొండ
కట్టెదుర వైకుంఠము కాణాచయిన కోండ తేట్టెలాయే మహీమలే తిరుమల కొండ తిరుమల కొండ
తిరుమల కొండ తిరుమల కొండ

తిరువీధుల మెరసినీ దేవ దేవుడు
తిరువీధుల మెరసినీ దేవ దేవుడు గరిమల మించిన సింగారముల తోడను
తిరువీధుల మెరసినీ దేవ దేవుడు దేవ దేవుడు

బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే
బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే
తందనానా ఆహి తందనానాపురే తందనానా భళ తందనానా
పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే
తనదననా భళ తనదనానా
నిండారరాజు నిద్రించు నిద్రయునొకటె అండన్ బంటు నిద్ర అదియు నొకటె
మెండైన బ్రహ్మణుడు మెట్టుభూమి యొకటే
మెండైన బ్రహ్మణుడు మెట్టుభూమి యొకటే చండాలుడుండేట్టి సరి భూమి యొకటే
బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే
కడగి ఏనుగు మీద కాయు ఎండొకటె పుడమి శునకము మీద పొలయు ఎండొకటె
కడుపుణ్యులను పాపకర్ములను సరిగావ జడియు శ్రీవేంకటేశ్వరు నామమొక్కటే
కడుపుణ్యలను పాపకర్ములను సరిగావ జడియు శ్రీవేంకటేశ్వరు నామమొక్కటే
బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే
తందనానా ఆహి తందనానాపురే తందనానా భళ తందనానా
పర బ్రహ్మమొక్కటే భళ తందనానా
పర బ్రహ్మమొక్కటే భళ తందనానా
పర బ్రహ్మమొక్కటే భళ తందనానా

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

పాట ఇక్కడ వినండి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments: