పల్లవి:
బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానె నీ పాదము
బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానె నీ పాదము
బ్రహ్మ కడిగిన పాదము
చరణం1:
చెలగి వసుధ గొలిచిన నీ పాదము బలితల మోపిన పాదము
తలకగ గగనము తన్నిన పాదము
తలకగ గగనము తన్నిన పాదము బలరిపు గాచిన పాదము
బ్రహ్మ కడిగిన పాదము
చరణం2:
పరమయోగులకు పరిపరి విధముల వరమొసగెడి నీ పాదము
తిరువేంకటగిరి తిరమని చూపిన పరమ పదము నీ పాదము
బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానె నీ పాదము
బ్రహ్మ కడిగిన పాదము
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
పాట ఇక్కడ వినండి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
No comments:
Post a Comment