Sep 24, 2008

ఏప్రిల్ ఒకటి విడుదల

గాత్రం:బాలు,చిత్ర

పల్లవి:

ఒంపుల వైఖరి సొంపుల వాకిలి ఇంపుగ చూపవే వయ్యారి
వెల్లువ మాదిరి అల్లరి ఆకలి ఎందుకు పోకిరి చాలుమరి
మొవిని మగతావిని ముడి వేయనీయవా
కాదని అనలేనని గడియైన ఆగవా
అదుపు పొదుపులేని ఆనందం కావాలి
హద్దు పొద్దులేని ఆరాటం ఆపాలి
ఒంపుల వైఖరి సొంపుల వాకిలి ఇంపుగ చూపవే వయ్యారి
వెల్లువ మాదిరి అల్లరి ఆకలి ఎందుకు పోకిరి చాలుమరి

చరణం1:

మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునాం
కంఠే భద్దాబి వర్గే స్వంజీవ శరధస్పతం
స్వంజీవ శరధస్పతం స్వంజీవ శరధస్పతం
లాలి లాలి లాలి లాలి లాలి లాలి లాలి లాలి లాలి లాలి
కాంక్షతో కైపు నిప్పు ఎంతగా కాల్చినా
తీక్షగా ఓర్చుకున్న మొక్షమే ఉండదా
శ్వాసలో మొహదాహం గ్రీష్మమై వీచగా
మొక్షతో వేగుదాహం పరయాగ వాటిక
కాలమే కాలిపోయే ఆజ్యమే పోయనా
మౌనమే గానమయ్యే ముహుర్తమే చూడవా

ఒంపుల వైఖరి సొంపుల వాకిలి ఇంపుగ చూపవే వయ్యారి
వెల్లువ మాదిరి అల్లరి ఆకలి ఎందుకు పోకిరి చాలుమరి

చరణం2:

నిష్టగా నిన్ను కోరి నియమమే దాటినా
కష్టమే సేదతీరే నేస్తమే నోచనా
నిగ్రహం నీరుకారి జ్వాలలా దించినా
నేర్పుగా ఈది చేరే నిశ్చయం బెట్టనా
సోయగం సొంతమయ్యే స్వర్గమై చేరవా
మదనమే అంతమయ్యే అమృతం అందుకో

ఒంపుల వైఖరి సొంపుల వాకిలి ఇంపుగ చూపవే వయ్యారి
వెల్లువ మాదిరి అల్లరి ఆకలి ఎందుకు పోకిరి చాలుమరి
మొవిని మగతావిని ముడి వేయనీయవా
కాదని అనలేనని గడియైన ఆగవా
అదుపు పొదుపులేని ఆనందం కావాలి
హద్దు పొద్దులేని ఆరాటం ఆపాలి
ఒంపుల వైఖరి సొంపుల వాకిలి ఇంపుగ చూపవే వయ్యారి
వెల్లువ మాదిరి అల్లరి ఆకలి ఎందుకు పోకిరి చాలుమరి హా

||

No comments: