పల్లవి:
సరికొత్త చీర ఊహించినాను సరదాల సరిగంచు నేయించినాను
మనసూ మమత పడుగూ పేక చీరలో చిత్రించినాను
ఇది ఎన్నో కలల కలనేత నా వన్నెల రాశికీ సిరి జ్యోతా
నా వన్నెల రాశికీ సిరి జ్యోతా
చరణం1:
ముచ్చట గొలిపే మొగలి పొత్తుకు ముళ్ళు వాసన ఒక అందం
అభిమానం గల ఆడపిల్లకు అలక కులుకు ఒక అందం
ఈ అందాలన్నీ కల బోసా నీ కొంగుకు చెంగున ముడి వేస్తా
ఈ అందాలన్నీ కల బోసా నీ కొంగుకు చెంగున ముడి వేస్తా
ఇది ఎన్నో కలల కలనేత నా వన్నెల రాశికీ సిరి జ్యోతా
నా వన్నెల రాశికీ సిరి జ్యోతా
చరణం2:
చుర చుర చూపులు ఒక మారు, నీ చిరు చిరు నవ్వులు ఒక మారు
మూతి విరుపులు ఒక మారు, నువ్వు ముద్దుకు సిద్ధం ఒక మారు
నువ్వు ఏ కళనున్నా మహ బాగే ఈ చీర విశేషం అలాగే
నువ్వు ఏ కళనున్నా మహ బాగే ఈ చీర విశేషం అలాగే
సరికొత్త చీర ఊహించినాను సరదాల సరిగంచు నేయించినాను
మనసూ మమత పడుగూ పేక చీరలో చిత్రించినాను
ఇది ఎన్నో కలల కలనేత నా వన్నెల రాశికీ సిరి జ్యోతా
నా వన్నెల రాశికీ సిరి జ్యోతా
|
No comments:
Post a Comment