

పల్లవి:
గంధము పుయ్యరుగా పన్నీరు గంధము పుయ్యరుగా
గంధము పుయ్యరుగా పన్నీరు గంధము పుయ్యరుగా
అందమైన యదునందనుపై
అందమైన యదునందనుపై
కుందరదన విరువొందన పరిమళ గంధము పుయ్యరుగా
అందమైన యదునందనుపై
కుందరదన విరువొందన పరిమళ గంధము పుయ్యరుగా
గంధము పుయ్యరుగా పన్నీరు గంధము పుయ్యరుగా
తిలకము దిద్దరుగా కస్తూరి తిలకము దిద్దరుగా
తిలకము దిద్దరుగా కస్తూరి తిలకము దిద్దరుగా
కళ కళమను ముఖ కళగని సొక్కుచు
కళ కళమను ముఖ కళగని సొక్కుచు
పలుకుల నమృతము లొలికే స్వామికి
గంధము పుయ్యరుగా పన్నీరు గంధము పుయ్యరుగా
గంధము పుయ్యరుగా పన్నీరు గంధము పుయ్యరుగా
చరణం1:
చేలము కట్టరుగ బంగారు చేలము కట్టరుగా
చేలము కట్టరుగ బంగారు చేలము కట్టరుగా
మాలిమితో గోపాల బాలురతో
మాలిమితో గోపాల బాలురతో
ఆలమేపిన విశాల నయనునికి
గంధము పుయ్యరుగా పన్నీరు గంధము పుయ్యరుగా
గంధము పుయ్యరుగా పన్నీరు గంధము పుయ్యరుగా
చరణం2:
పూజలు సేయరుగా మనసార పూజలు సేయరుగా
పూజలు సేయరుగా మనసార పూజలు సేయరుగా
పూజలు సేయరుగా మనసార పూజలు సేయరుగా
జాజులు మరి విరజాజులు దవనము
జాజులు మరి విరజాజులు దవనము
రాజిత త్యాగరాజవినుతునికి
గంధము పుయ్యరుగా పన్నీరు గంధము పుయ్యరుగా
తిలకము దిద్దరుగా కస్తూరి తిలకము దిద్దరుగా
చేలము కట్టరుగా బంగారు చేలము కట్టరుగా
పూజలు సేయరుగా మనసార పూజలు సేయరుగా
గంధము పుయ్యరుగా పన్నీరు గంధము పుయ్యరుగా
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
పాట ఇక్కడ వినండి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
No comments:
Post a Comment