గాత్రం: ఎస్.జానకి
సాహిత్యం: సముద్రాల
సంగీతం: దక్షిణామూర్తి
దర్శకత్వం: కమలాకర కామేశ్వరరావు
నిర్మాతలు: లక్ష్మిరాజ్యం,శ్రీధరరావు
సంస్థ: రాజ్యం పిక్చర్స్
విడుదల: 1963

పల్లవి:
నరవరా ఆ ఆ ఆ
నరవరా ఓ కురువరా
నరవరా ఓ కురువరా
వీరుల నీకు సరి లేరనీ సరసులలో జాణవనీ
విన్నారా కన్నారా కనులారా
ఓ నరవరా ఓ కురువరా
చరణం 1:
ఓ సురవతి నెదిరించి రణాన
పశుపతి మురిపించి బలాన
ఓ సురవతి నెదిరించి రణాన
పశుపతి మురిపించి బలాన
సాటి లేని వీరుండన్న యశమును గన్న
సాటి లేని వీరుండన్న యశమును గన్న
అర్జున ఫల్గుణ పార్థ కిరీటి
బిరుదు గన్న విజయా
నరవరా ఓ కురువరా
చరణం 2:
ఓ ఓ ఓ నిను గనీ తల ఊపే ఉలూచీ
కొనుమనీ చెయి సాచె సుభద్రా
నిను గనీ తల ఊపే ఉలూచీ
కొనుమనీ చెయి సాచె సుభద్రా
నీదు వన్నె చిన్నె గన్న చెలువల మిన్న
నీదు వన్నె చిన్నె గన్న చెలువల మిన్న
అలరుల విలుతుని ములుకుల గురియై
వలపులందుకొనరా
నరవరా ఓ కురువరా
వీరుల నీకు సరి లేరనీ సరసులలో జాణవనీ
విన్నారా కన్నారా కనులారా
ఓ నరవరా ఓ కురువరా
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
No comments:
Post a Comment