పల్లవి:
మనసా నేనెవరో నీకు తెలుసా,నీకు తెలుసా
తెలుసా మనసా
చరణం1:
వేషలు బాషలు వేదాంతములను ఉ ఉ ఉ
మనసా వేషలు బాషలు వేదాంతములను
మిసమిస ఎరలను మింగావు,నా పసిడి గాలమునకు చిక్కావు
మిసమిస ఎరలను మింగావు,నా పసిడి గాలమునకు చిక్కావు
ఓ మనసా నేనెవరో నీకు తెలుసా,నీకు తెలుసా
తెలుసా మనసా
చరణం2:
చచ్చు చిచ్చుల భేదము తెలియక ఆ ఆ ఆ ఆ ఆ ఆ
చచ్చు చిచ్చుల భేదము తెలియక
చిచ్చునే చచ్చనుకున్నావు,నా ఎత్తు నెరుగకున్నావు
చిచ్చునే చచ్చనుకున్నావు,నా ఎత్తు నెరుగకున్నావు
ఓ మనసా నేనెవరో నీకు తెలుసా,నీకు తెలుసా
తెలుసా మనసా
చరణం3:
ప్రకృతి పురుషులు ఒకటే ఒకటను ఉ ఉ ఉ ఉ ఉ
ప్రకృతి పురుషులు ఒకటే ఒకటను
పరమ రహస్యం మరచావు,సద్గురు బోధన వినకున్నావు
పరమ రహస్యం మరచావు,సద్గురు బోధన వినకున్నావు
ఓ మనసా నేనెవరో నీకు తెలుసా,నీకు తెలుసా
తెలుసా మనసా
|
No comments:
Post a Comment