Oct 29, 2008

పులిబిడ్డ

పల్లవి:

మనసంత మంగళ వాద్యాలే ఈ వేళ కళ్యాణ శుభమంత్రాలే
అనురాగ గీతాల సుమమాలలల్లి అనుబంధ గంధాలు మనమీద చల్లి దేవతలే దీవించు వేళ
మనసంత మంగళ వాద్యాలే ఈ వేళ కళ్యాణ శుభమంత్రాలే

చరణం1:

చిగురుటాకుల పందిరిలోన చిలకపాప పేరంటంలో
కోయిలమ్మ మేనా కట్టి కొంగుకొంగు ముడిపెడుతుంటే
ఆనందభాష్పాల పుష్ఫాక్షలతో ఆశీర్వదించేనులే ఈ వసంతం
ఆరారు ఋతువులు ఇక మనకు సొంతం
ఇక మనకు సొంతం
మనసంత మంగళ వాద్యాలే ఈ వేళ కళ్యాణ శుభమంత్రాలే

చరణం2:

కలలు పండి గెలలేస్తుంటే కళ్ళు నన్ను నిలదీస్తుంటే
ఇద్దరొకటై గదిలో చేరి నిద్దరకోసం వెతుకుతు వుంటే
ఏడేడు అడుగుల సప్తస్వరాలు నా ముద్దు మురిపాల మధురాక్షరాలు
ఎనలేని ప్రేమకు ఎన్నో వరాలు,ఎన్నో వరాలు

మనసంత మంగళ వాద్యాలే ఈ వేళ కళ్యాణ శుభమంత్రాలే
మనసంత మంగళ వాద్యాలే ఈ వేళ కళ్యాణ శుభమంత్రాలే

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments: