సాహిత్యం : వేటూరి

పల్లవి:
నిరంతరమూ వసంతములే మందారముల మరందములే
స్వరాలు సుమాలుగ పూచే పదాలు ఫలాలుగ పండే
నిరంతరమూ వసంతములే మందారముల మరందములే
నిరంతరమూ వసంతములే మందారముల మరందములే
స్వరాలు సుమాలుగ పూచే పదాలు ఫలాలుగ పండే
నిరంతరమూ వసంతములే మందారముల మరందములే
చరణం1:
హాయిగా పాటపాడే కోయిలే మాకు నేస్తం
తేనెలో తానమాడే తుమ్మెదే మాకు చుట్టం
నదులలో వీణ మీటే తెమ్మెరే మాకు ప్రాణం
అలలపై నాట్యమాడే వెన్నెలే వేణు గానం
ఆకశానికవి తారలా,ఆశకున్న విరిదారులా
ఈ సమయం ఉషోదయమై మా హృదయం జ్వలిస్తుంటే
నిరంతరమూ వసంతములే మందారముల మరందములే
స్వరాలు సుమాలుగ పూచే పదాలు ఫలాలుగ పండే
నిరంతరమూ వసంతములే మందారముల మరందములే
చరణం2:
అగ్నిపత్రాలు రాసీ గ్రీష్మమే సాగిపోయే
మెరుపులేఖల్లు రాసే మేఘమే మూగబోయే
మంచు ధాన్యాలు కొలిచీ పౌష్యమే వెళ్ళిపోయే
మాఘ దాహాలలోనా అందమే అత్తరాయే
మల్లెకొమ్మ చిరునవ్వులా ,మనసులోని మరు దివ్వెలా
ఈ సమయం రసోదయమై మా ప్రణయం ఫలిస్తుంటే
నిరంతరమూ వసంతములే మందారముల మరందములే
స్వరాలు సుమాలుగ పూచే పదాలు ఫలాలుగ పండే
నిరంతరమూ వసంతములే మందారముల మరందములే
|
No comments:
Post a Comment