Oct 31, 2008

అన్నమయ్య

గాత్రం:బాలు



పల్లవి:

కలగంటి కలగంటి ఇప్పుడిటు కలగంటి
ఎల్లలోకములకు అప్పడగు తిరు వేంకటాద్రీశుగంటి
కలగంటి కలగంటి ఇప్పుడిటు కలగంటి
ఎల్లలోకములకు అప్పడగు తిరు వేంకటాద్రీశుగంటి
ఇప్పుడిటు కలగంటి

చరణం1:

అతిశయంబైన శేషాధ్రి శిఖరముగంటి ప్రతిలేని గోపుర ప్రభలుగంటి
శతకోతి సుర్యతేజములు వెలుగగగంటి చతురాస్యు పొడగంటి చతురాస్యు పొడగంటి
చయ్యన మేలుకొంటి
ఇప్పుడిటు కలగంటి

చరణం2:

అరుదైన శంఖచక్రాదులిరుగడగంటి
సరిలేని అభయ హస్తమునుకంటి
తిరు వేంకటాచలదిపుని చూడగగంటి
హరిగంటి గురుగంటి
హరిగంటి గురుగంటి
అంతట మేలుకంటి

కలగంటి కలగంటి ఇప్పుడిటు కలగంటి
ఎల్లలోకములకు అప్పడగు తిరు వేంకటాద్రీశుగంటి
ఇప్పుడిటు కలగంటి ఇప్పుడిటు కలగంటి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~


పాట ఇక్కడ వినండి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments: