(మలయాళం చిత్రంలోని తెలుగు పాట ఆంధ్రరాష్ట్ర అవతరణ దినోత్సవం సంధర్భంగా మీకోసం)
గాత్రం:పి.సుశీల
విడుదల:1975
పల్లవి:
ఆంధ్రమాత నీకు వందనములమ్మ
అనురాగ మాల ఇదే అందుకోవమ్మ
ఆంధ్రమాత నీకు వందనములమ్మ
అనురాగ మాల ఇదే అందుకోవమ్మ
ఆంధ్రమాత
చరణం1:
తుంగభద్ర పెన్న కృష్ణ గోదావరి
ఉగ్గుపాలుగ పోసి సాకినవమ్మ
తుంగభద్ర పెన్న కృష్ణ గోదావరి
ఉగ్గుపాలుగ పోసి సాకినవమ్మ
త్యాగయ్య క్షేత్రయ్య గానామృతముల
దేశమంత డోలలూపినావమ్మ అమ్మా ఆ ఆ
మల్లమ్మ రుద్రమ్మ మహిత శౌర్యముతో
మహియందు నీ కీర్తి పెంచినావమ్మ
మల్లమ్మ రుద్రమ్మ మహిత శౌర్యముతో
మహియందు నీ కీర్తి పెంచినావమ్మ
అమరావతి అజంతా ఎల్లోరాల సౌందర్య దేవతగ వెలసినవమ్మ అమ్మా
ఆంధ్రమాత నీకు వందనములమ్మ
అనురాగ మాల ఇదే అందుకోవమ్మ
ఆంధ్రమాత మాతా
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
No comments:
Post a Comment