Sep 10, 2009

నిర్ణయం

గాత్రం:మనో,జానకి



పల్లవి:

మిలమిల మెరిసెను తార నీ ప్రేమలా
చిలిపిగ కురిసెను ప్రేమ నీ కన్నుల
గాలిలో లాలిలా గానమై ఇలా
లాలించెలే నన్నే ఓ పాపలా
వేధించెలే నన్నే నీ నీడలా
మిలమిల మెరిసెను తార నీ ప్రేమలా

చరణం1:

వెచ్చనైన గుండె గిన్నెలో వెన్ననింక దాచి వుంచుకో
పొన్నచెట్టు లేని తోటలో కన్నె వేణువాలపించకు
ప్రేమ అన్నదే ఓ ఓ ఓ పల్లవైనది
పెదవి తాకితే ఓ ఓ ఓ పాటలే అది
ఆమని ప్రేమని పాడే కోయిల

మిలమిల మెరిసెను తార నీ ప్రేమలా
చిలిపిగ కురిసెను ప్రేమ నీ కన్నుల
గాలిలో లాలిలా గానమై ఇలా
లాలించెలే నన్నే ఓ పాపలా
వేధించెలే నన్నే నీ నీడలా

చరణం2:

మౌనమైన మాధవీలత తాను కొమ్మనల్లుకున్నది
వేల్లువైన రాగమిప్పుడే ఏకతాళమందుకున్నది
తోచదాయెనే ఓ ఓ ఓ తోడులేనిదే
కౌగిలింతలే ఓ ఓ ఓ కావ్యమాయెలే
ఎన్నడూ లేనిది ఎందుకో ఇలా

మిలమిల మెరిసెను తార నీ ప్రేమలా
చిలిపిగ కురిసెను ప్రేమ నీ కన్నుల
గాలిలో లాలిలా గానమై ఇలా
లాలించెలే నన్నే ఓ పాపలా
వేధించెలే నన్నే నీ నీడలా
మిలమిల మెరిసెను తార నీ ప్రేమలా

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

1 comment:

srikanth said...

"గాలిలో లాలిలా గానమై ఇలా" few mistakes