Sep 11, 2009

గులాబి

గాత్రం:సునీత (తొలి పాట)




పల్లవి:


ఈ వేళలో నీవు ఏం చేస్తు వుంటావో
అనుకుంటు వుంటాను ప్రతి నిమిషము నేను
నా గుండె ఏనాడొ చేయి జారి పోయింది
నీ నీడగా మారి నా వైపు రానంది
దూరాన వుంటునే ఏం మాయ చేసావొ
ఈ వేళలో నీవు ఏం చేస్తు వుంటావో
అనుకుంటు వుంటాను ప్రతి నిమిషము నేను

చరణం1:

నడి రేయిలో నీవు నిదరైన రానీవు
గడిపేదెలా కాలము గడిపేదెలా కాలము
పగలైన కాసేపు పని చేసుకోనీవు
నీ మీదనే ధ్యానము నీ మీదనే ధ్యానము
ఏ వైపు చూస్తున్నా నీ రూపే తొచింది
నువు కాక వేరేది కనిపించనంటోంది
ఈ ఇంద్ర జాలాన్ని నీవేన చేసింది
నీ పేరులో ఏదో ప్రియమైన కైపుంది
నీ మాట వింటూనే ఏం తొచనీకుంది
నీ మీద ఆశేదో నను నిలువనీకుంది
మతి పొయి నేనుంటే నువు నవ్వుకుంటావు


ఈ వేళలో నీవు ఏం చేస్తు వుంటావో
అనుకుంటు వుంటాను ప్రతి నిమిషము నేను
ఈ వేళలో నీవు ఏం చేస్తు వుంటావో
అనుకుంటు వుంటాను ప్రతి నిమిషము నేను

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments: