Sep 12, 2009

శకుంతల

తారాగణం : రామారావు,బి.సరోజాదేవి,నాగయ్య,బేబి పద్మిని
గాత్రం: సుశీల
సంగీతం : ఘంటసాల
దర్శకత్వం : కమలాకర కామేశ్వరరావు
నిర్మాతలు: శ్రీధరరావు,లక్ష్మీరాజ్యం
నిర్మాణ సంస్థ : రాజ్యం పిక్చర్స్
విడుదల: 1966




పల్లవి:

నాకంటి పాపవైనా నా ఇంటి దీపమైనా
నీవే సుకుమార రారా ఓ వీర
నాకంటి పాపవైనా నా ఇంటి దీపమైనా
నీవే సుకుమార రారా ఓ వీర

చరణం1:

నెలరాజులోని సొగసు
దినరాజులోని వెలుగు
నెలరాజులోని సొగసు
దినరాజులోని వెలుగు
నీయందు నిండి నా కలలు పండి
యువరాజువవుదులేరా
రారా సుకుమార ఒహో వీర

చరణం2:

హరిచేత సిరులు పొంది
హరుచేత వరములొంది
హరిచేత సిరులు పొంది
హరుచేత వరములొంది
లోకాలనేలి భోగాల తేలి
చిరకీర్తినందుకోర
రారా సుకుమార ఒహో వీర

చరణం3:

ఇంటింట శాంతి నిలిపి
జగమంత కాంతి నింపి
ఇంటింట శాంతి నిలిపి
జగమంత కాంతి నింపి
సురవరుల నరుల జేజేలనంది
వర్ధిల్లు భరతవీర
రారా సుకుమార ఒహో వీర

నాకంటి పాపవైనా నా ఇంటి దీపమైనా
నీవే సుకుమార రారా ఓ వీర
రారా ఓ వీర


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~



~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

No comments: